ధాన్యపు సిరులు


Mon,May 20, 2019 11:23 PM

-వెనువెంటనే తూకాలు, అక్కడినుంచి మిల్లులకు తరలింపు
-జిల్లావ్యాప్తంగా 147 కొనుగోలు కేంద్రాలు
-ఇప్పటివరకు 4,81,359 క్వింటాళ్ల కొనుగోలు
-6,728 మంది రైతుల ఖాతాల్లో రూ.45 కోట్లు జమ
-చివరిగింజ వరకు కొనుగోలు చేసే లక్ష్యం
-దళారులకు విక్రయించి మోసపోవద్దని అధికారుల హితవు
యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగడంతో జిల్లాలో ధాన్యం పోటెత్తుతున్నది. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం మంచి మద్దతు ధర కల్పించడమే కాకుండా ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను గతనెలలో ప్రారంభించింది. మొత్తం 147 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా..సోమవారం సాయంత్రం వరకు 4,81,359 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 4,28,525 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. 6,728 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.45 కోట్లు జమచేయగా..ఇంకా రూ.85.20 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఎండాకాలం కావడంతో వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. లారీలను అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను పౌరసరఫరాల సంస్థ సరఫరా చేస్తున్నది. ధాన్యం ఏ గ్రేడ్‌ రకానికి రూ.1770, సాధారణ రకానికి రూ.1750 మద్దతు ధర ఇస్తున్నదని, దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ రైతులకు సూచించారు. ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకరావాలని ఆయన పేర్కొన్నారు.

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నది.. రైతున్నలను దళారుల బారి నుంచి కాపాడి.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాన్నదే ప్రభుత్వ ఆశయం. ఇందుకు అనుగుణంగా రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా147 కొనుగోలు కేంద్రాల నుంచి సోమవారం వరకు 4,81,359 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4,28,525 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ధాన్యం కోనుగోలు చేసిన వెనువెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 6,728మంది రైతుల ఖాతాలో రూ.45 కోట్లు జమ చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ‘నమస్తే తెలంగాణ ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

రైతు పండించిన పంటకు సరియైన గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐకేపీ ద్వారా 95, సహకార సంఘాల ద్వారా 52, మొత్తం 147 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో సోమవారం సాయం త్రం వరకు జిల్లాలో 13,809 రైతుల నుంచి మహిళా సం ఘాల ద్వారా 95 కేంద్రాల నుంచి 2,61,170 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 52 సహకార సంఘాల నుంచి 2,20,189 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం జిల్లాలో 4,81,359 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గాను రూ.85.20కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం నాటికి 6,728 మంది రైతులకు రూ.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటి వరకు ట్యాబ్‌లో 12,810మంది రైతుల వివరాలు ట్యాబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. రోజువారీగా రైతుల వివరాలను ఆప్‌లోడ్‌ చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

147 కేం ద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం లోంచి 4,28,525 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 52,834 క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంది. కొనుగోలు చేసిన సెంటర్లలో ఎక్కడ పెండింగ్‌లో ఉండకుండా వెనువెంటనే మిల్లులకు తరలించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. కొనుగోలు కేంద్రాలను జేసీ పద్మాకర్‌, డీఎస్‌వో వెంకటేశ్వర్లు సందర్శించి కొనుగోళ్లను సమీక్షిస్తున్నారు. వరిధాన్యం గ్రేడ్‌ (ఏ) రకం క్వింటాలుకు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు, తాగునీటి సౌకర్యం, మహిళల కోసం తాత్కాలిక టాయిలెట్స్‌, కరెంట్‌, టార్పాలిన్‌ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్‌ స్కేల్స్‌, మాశ్చరైజ్‌ మీటర్లు అందుబాటులో ఉంచారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...