హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ లేని ప్లాట్లు కొనొద్దు


Mon,May 20, 2019 11:20 PM

వర్గల్‌ : అక్రమ లే అవుట్లు..అడ్డగోలుగా వెలసిన వెం చర్లపై సోమవారం మండల పరిధిలోని గౌరారం, సింగాయిపల్లి గ్రామాల్లో హెచ్‌ఎండీఏ జాయింట్‌ ప్లా నింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. హెచ్‌ఎండీఏ అప్రువల్‌, లే అవుట్ల పర్మిషన్‌ లేకుండా ప్లాట్లను ఎలా విక్రయిస్తారని నిర్వాహకులను నిలదిశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కచ్చితంగా నడుచుకోవాలని సూచించా రు. వెంచర్లు చేసేవారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ప్లాట్లు కొనేవారు సైతం కచ్చితంగా లే అవుట్లు ఎచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయా? లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే కొనొగోలు చేయాలని తెలిపారు. లే అవుట్లు, అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొని నష్టపోవొద్దని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా గౌ రారం, సింగాయిపల్లి, శాకారం గ్రామాల్లో అక్రమంగా వెలసిన వెంచర్లను తొలిగిస్తున్నట్లు, సంబంధిత వెంచర్‌ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 11 అక్రమ వెంచర్లను గుర్తించామని వీటిలో ఎనిమిదింటిని కూల్చేస్తామని జేపీవో తెలిపారు.

భూ నిర్వాసితులకు న్యాయం చేయండి
అక్రమ లే అవుట్లు...అనుమతలు లేని వెంచర్లను తొ లిగించే క్రమంలో భాగంగా సోమవారం గౌరారం-మామిడ్యాల గ్రామాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లలో కట్టడాలను తొలిగిస్తున్న క్రమంలో అధికారులకు ప్లాట్లు కొనుగోలుదారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండి ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లను ఎలా కొనుగోలు చేశారని బాధితులను అధికారులు ప్రశ్నించారు. పై అధికారుల ఆదేశాల ప్రకారం కూల్చివేస్తున్నట్లు తెలిపారు. వెంటనే యంత్ర సహాయంతో కట్టడాలను తొలిగిస్తున్న క్ర మంలో అక్కడకు చేరుకున్న మరికొంత మంది బాధితులు అధికారులతో గొడవకు దిగారు. దీంతో పోలీసుల సహాయంతో నాలుగు వెంచర్లలోని కట్టడాలను తొలిగించారు. బాధితులంతా కలిసి తమకు ఇవేమి తెలియదని కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు పోయినందుకే వచ్చిన డబ్బులతో ప్లాట్లు కొన్నామని బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో రెండురోజుల్లో ఏదో ఒకటి తేల్చాలని, విషయం పై అధికారుల దృష్టికి తీసుకవెళ్లనున్నట్లు జేపీవో శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మేరీ స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి సంతోశ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, పంగ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...