సైకిల్.. అడ్వెంచర్


Mon,May 20, 2019 03:43 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జిల్లాకేంద్రం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పర్యాటక కేంద్రంగానే కాకుం డా సాహస క్రీడలకు వేదికగా మారుతుంది. ఇప్పటికే పట్ట ణంలోని రోప్‌వే, అడ్వెంచర్ పార్కు లాంటి సాహస క్రీడలతో ఇప్పటికే అనేక మంది పర్యాటకులను ఆకర్శిస్తుంది. దీంతో పాటు సాయంత్రం వేళలో పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా కోమటి చెరు వు వచ్చి సరదాగా గడుపుతున్నారు. కోమటిచెరువు మరో సాహస క్రీడకు వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితో జిప్ సైక్లింగ్‌ను ఏర్పాటు చేశారు. జిప్ సైక్లింగ్ అనేక మంది పర్యాటకులను కోమటి చెరువు ఆకర్శించనుంది. త్వరలోనే జిల్లా ప్రజలకు జిప్ సైక్లింగ్ సాహస క్రీడ అందుబాటులోకి రానుంది.
కోమటి చెరువు రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా మారుతుంది. తన అందాలతో సిద్దిపేట పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల పర్యాటకులను ఆకర్శిస్తున్న కోమటి చెరువు మినీ ట్యాంకుబండ్ మరో సాహస క్రీడ సాధనకు ముస్తాబైంది. ఆ సాహస క్రీడే జిప్ ైస్లెకింగ్. దీనిని రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో నిర్మించేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపారు. దీంతో మరింత మంది పర్యాటకులు కోమటి చెరువుకు రానున్నారు. కోమటి చెరువుపై సైక్లింగ్ చేసేవారి కోసం, అడ్వెంచర్ పార్కులో వివిధ సాహస క్రీడలతో ఇప్పటికే అనేక మంది చిన్నారులను ఆకర్శిస్తున్న కోమ టి చెరువు జిప్ సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సాహస క్రీడ కోసం అనేక మంది ఆసక్తి కనబర్చనున్నారు. ఆహ్లాద వాతావరణంతోపాటు సాహస క్రీడలకు కో మటిచెరువు ప్రాంతం నెలవు కానుంది. త్వరలోనే ఎమ్మెల్యే హరీశ్‌రావు జిప్ సైక్లింగ్‌ను ప్రారంభించి పర్యాటకులకు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకరానున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...