బాధిత కుటుంబాలకు అండగా ...


Mon,May 20, 2019 03:40 AM

మండలంలోని రఘోత్తంపల్లికి చెందిన రెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం నాడు కొండపాక మండలం కుకునూరపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన మృతదేహానికి గజ్వేల్ సర్కార్ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు. అందుకు వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని రఘోత్తంపల్లికి తీసుకవచ్చేందుకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వైద్యాధికారులతో మాట్లాడి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు. అదే విధంగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
దుబ్బాక, నమస్తే తెలంగాణ: మండలంలోని చౌదర్‌పల్లిలోని దుబ్బరాజేశ్వరాలయంలో మూడు రోజులుగా బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించగా, ఆదివారం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో దుబ్బరాజేశ్వరుడికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం అష్టోత్తర శతకలశాభిషేకం, చండీహావనం, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...