విద్యాభివృద్ధికి సర్కారు కృషి


Mon,May 20, 2019 03:39 AM

దుబ్బాక టౌన్: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మండలంలోని హబ్షీపూర్ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతీరావు పూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల పనులను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మిస్తున్న తరగతి గదులు, విద్యార్థుల వసతి గదులను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలను అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు జరుగాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోలిపేట మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రతి పేదింటి విద్యార్థికి కార్పొరేట్ తరహాలో విద్యను అందించాలన్న లక్ష్యంతోనే ప్రతి మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందుకు అవసరమైన పక్కా భవనాలను నిర్మించి విద్యార్థులకు విద్యతో పాటు రెసిడెన్షియల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులకు మంచి వాతావరణలో విద్యను అందించేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యేడు నియోజకవర్గంలో పదవ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట దుబ్బాక మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి కడతల రవీందర్‌రెడ్డి, నాయకులు రొట్టె రమేశ్, పడాల నరేశ్ తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...