ఎంపీపీ పీఠంపై గులాబీ జెండా!


Sun,May 19, 2019 01:38 AM

-దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌దే జోరు
-నూతన మండలాల్లో ఎంపీపీ పీఠంపై ప్రత్యేక ఆసక్తి
-ఎంపీపీ స్థానాలపై మహిళలకే పెద్దపీటవిషయం తెలిసిందే.
నియోజకవర్గంలో ఏడు మండలాల్లో 7 జడ్పీటీసీ స్థానాలకు 61 మంది అభ్యర్థులు, 68 ఎంపీటీసీ స్థానాలకు 416 మంది పోటీ చేశారు. దుబ్బాకలో 13 ఎంపీటీసీ స్థానాలకు 71 మంది, మిరుదొడ్డిలో 11 స్థానాలకు 39 మంది, తొగుటలో 9 స్థానాలకు 35 మంది, దౌల్తాబాద్‌లో 9 స్థానాలకు 34 మంది, రాయపోల్‌ 8 స్థానాలకు 26 మంది పోటీ చేశారు. చేగుంటలో 13 స్థానాలకు 50 మంది, నార్సింగ్‌లో 5 స్థానాలకు 20 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఎంపీపీ పీఠంపై ప్రత్యేక దృష్టి..
నియోజకవర్గంలో పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురనుంది. ఏడు మండలాల్లో జడ్పీటీసీలతో పాటు ఎంపీపీ పీఠాల్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కైవసం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నూతనంగా ఏర్పాటైన రాయపోల్‌, నార్సింగ్‌ మండలాల్లో ఎంపీపీ పీఠంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. రాయపోల్‌ ఎంపీపీ బీసీ జనరల్‌ కావటంతో బీసీ అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్తపల్లి, బేగంపేట ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీపీ పదవిపై ఆసక్తి చూపుతున్నారు. నార్సింగ్‌ మండలంలో తొలిసారి పరిషత్‌ ఎన్నికలు జరుగటంతో ఇక్కడ కూడా ఎంపీపీ పీఠంపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఈ మండలంలో శేరిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇకపోతే మిగిలిన పాత మండలాలైన దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, చేగుంట మండలాల్లో ఎంపీపీ పదవి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, నార్సింగ్‌ మండలాల్లో ఎంపీపీ పదవి మహిళలకే రిజర్వేషన్‌ ఉంది. మూడు మండలాల్లో జనరల్‌ స్థానాలలో కూడా మహిళలు పోటి పడే అవకాశం లేకపోలేదు. దీంతో నియోజకవర్గంలో ఎంపీపీ పదవులు మహిళలకే సింహాభాగం లభించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...