నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు


Sun,May 19, 2019 01:37 AM

తొగుట: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి మోహన్‌ హెచ్చరించారు. శనివారం తొగుటలోని ఎరువులు, విత్తనాల దుకానాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ బీటీ-3 (కలుపు మందు తట్టుకునే రకం) విత్తనాలను కొనుగోలు చేయరాదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మంజూర్‌ హుస్సేన్‌ తదితరులున్నారు.

రాయపోల్‌: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దౌల్తాబాద్‌ వ్యవసాయ అధికారి గోవిందరాజులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఫర్టిలైజర్‌ షాపులను పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్‌ షాపులో ఉన్న నిల్వలను, రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత ఖచ్చితంగా వ్యాపారులు రసీదులు ఇవ్వాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌వో బీక్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మిరుదొడ్డి: రైతులకు ఎరువుల దుకాణపు యజమానులు వానకాలం సీజన్‌లో నకిలీ విత్తనాలను విక్రయిస్తే అట్టి దుకాణపు యజమానుల పై కఠిన చర్యలు తీసుకుంటామని మిరుదొడ్డి ఏవో బోనాల మల్లేశం హెచ్చరించారు. శనివారం మిరుదొడ్డిలోని ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను, విత్తనాల బ్యాగులను పరిశీలించారు. ఎరువుల దుకాణాల్లో రైతులు విత్తనాలను కొనుగోలు చేయగానే వాటికి సంబంధించిన రసీదులను పొందాలని సూచించారు. ప్రభుత్వం నిషేదించిన బీటీ-3 పత్తి విత్తనాలను, కాల పరిమితి ముగిసిన విత్తనాలను విక్రయిస్తే 1966 సీ -యాక్టు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని పేర్కొనారు. ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సరిపడే వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈవో లోహిత్‌ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...