విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు


Sun,May 19, 2019 01:36 AM

కఠిన చర్యలు : ఎస్‌ఐ సుధాకర్‌హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్‌ పట్టణంలో స్థానిక పోలీసులు, వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో శనివారం విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో గల స్టాకు, ఏయే రకాల విత్తనాలు నిల్వ ఉన్నాయి, ఏయే కంపెనీల విత్తనాలు విక్రయిస్తున్నారో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ దాస సుధాకర్‌, మండల వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతులకు నకిలీ విత్తనాలు ఇస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే వాడాలన్నారు. విత్తనాలు తీసుకునేటప్పుడు విధిగా రసీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. విత్తనాల ఎంపికలో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. పోలీసు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...