స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం


Sun,May 19, 2019 01:35 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్‌, జడ్పీటీసీ సుంకరి సరిత అన్నారు. స్థ్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం మండల ఎంపీటీసీలు విహారయాత్రకు వెళ్తున్న క్రమంలో మండల ఇన్‌చార్జి, మహాబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థులు వ్యవహరించాల్సిన తీరును వివరించారు.

అనంతరం వారు చేర్యాల విలేకరులతో మాట్లాడు తూ.. మండలంలని అన్ని గ్రామాలకు చెందిన టీఆర్‌ ఎస్‌ ఎంపీటీసీలు అదిష్టా నం ఖారారు చేసిన ఎమ్మె ల్సీ అభ్యర్థికి ఓటు వేసేందుకు సిద్ధ్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జ్యోతి, ఎంపీటీసీలు కడెం నిర్మల, వల్లప్రగడ వరలక్ష్మి, వేణుగోపాల్‌, బొల్గం రామస్వామి, మహిపాల్‌రెడ్డి, పెద్దింటి ప్రసాద్‌, బింగి కనకమ్మ, అత్కూరి కనకమ్మ, బొమ్మగారి రవిచందర్‌, శివగారి నర్సింహులు, వడ్లకొండ శ్రీనివాస్‌, అనంతుల పరమేశ్వరి, తివారి స్వాతి, నాయకులు సుం కరి మల్లేశం, వల్లప్రగడ వెంకటేశ్వర్లు, బింగి కనకయ్య, అత్కూరి జయరాములు, కడేం మల్లేశం, అనంతుల మల్లేశం పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...