నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు


Sun,May 19, 2019 01:28 AM

గజ్వేల్‌ రూరల్‌: అనుమతి లేని కంపెనీల రకాల విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఎరువులను అమ్మితే వ్యాపారులపై, కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని సీఐ ప్రసాద్‌, ఏవో నాగరాజు అన్నారు. శనివారం గజ్వేల్‌ మండలంలోని అన్ని విత్తనాలు, ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. నామమాత్రపు నాణ్యతతో నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలు, అమ్మే వ్యాపారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు, పోలీసు అధికారులు కలిసి వారం రోజుల పాటు అన్ని దుకాణాలలో సోదాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రైతులు బీజీ3, నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

పీడీయాక్టు నమోదు చేస్తాం...
జగదేవ్‌పూర్‌: వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే సదరు దుకాణాల లైసెన్సు రద్దు చేయడంతో పాటు, పీడీయాక్టు నమోదు చేస్తామని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్‌, కమిషనర్‌ ఆదేశాలతో శనివారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను స్థానిక పోలీసులతో కలసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లోని ఎరువుల విత్తనాల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ ప్రకాశ్‌ పోలీసులు పా

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...