వైభవంగా లక్ష్మీనృసింహ కల్యాణం


Fri,May 17, 2019 11:25 PM

గజ్వేల్‌రూరల్: మండలంలోని దిలాల్‌పూర్ మయూరాచల లక్ష్మీనృసింహాస్వామి ఆలయంలో నృసింహ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, మూలమూర్తికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో లక్ష్మీనృసింహాస్వామి కల్యాణాన్ని సర్పంచ్ దివ్య, ఆలయ కమిటీ సభ్యులు అత్తెల్లి బాల్‌నర్సయ్య, లచ్చిరెడ్డి తదితరులు స్వామివారు, అమ్మవారి తరఫున పెండ్లి పెద్దలుగా వ్యవహరించగా, గ్రామ పురోహితులు శ్యాంప్రసాద్ శర్మ, వేదపండితులు మారుతీశర్మ, నర్సింహాశర్మలు కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో కమి టీ సభ్యులు నారాయణరెడ్డి, సంతోశ్‌రెడ్డి, రాజేశం, యాదవరెడ్డి, టైలర్ శ్రీను, అంజయ్య, భక్తులు అమృతరెడ్డి, హనుమాన్ మాలధారణ భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...