ఆగ్రోస్‌ సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి


Thu,May 16, 2019 11:32 PM

-రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్‌ వంగ నాగిరెడ్డి
సిద్దిపేట అర్బన్‌ : రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆగ్రోస్‌ విత్తన విక్రయ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్‌ వంగ నాగిరెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం సిద్దిపేట అర్బన్‌ మండల, రూరల్‌ మండల ఆగ్రోస్‌ విత్తన విక్రయ కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్‌, ఎంపీపీ ఎర్రయాదయ్యతో కలిసి ప్రారంభించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆగ్రోస్‌ విత్తన కేంద్రాల్లో అందజేస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుబంధు, రైతుబీమాలతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జనుము, జీలుగ, మొక్కజొన్న, వరి విత్తనాలను సబ్సిడీపై అందిస్తారన్నారు. మార్కెట్‌ ఆకర్షనీయమైన రంగు రంగుల ప్యాకింగ్‌లను చూసి రైతులు మోసపోవద్దన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో)శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు కోరుకున్న విత్తనాలను కూడా తెప్పించి రైతులకు అందజేస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుందన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. బీటీ 3 పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు. ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచన మేరకే ముందస్తుగా సిద్దిపేటలో ఆగ్రోస్‌ సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాను ఏర్పాటు చేశామన్నారు. రైతులు అందరూ తప్పనిసరిగా భూ సార పరీక్షలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్‌ మండల రైతు సమన్వయ సమితి సమన్వయకర్త పటేల్‌రెడ్డి, వ్యవసాయ అధికారి బి.పరుశురాంరెడ్డి, సిద్దిపేట అర్బన్‌ మండల ఆగ్రోస్‌ నిర్వాహకులు రాజు, వర్మ పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...