ఎల్లలు దాటిన సేవ


Thu,May 16, 2019 11:30 PM

-కేదారినాథ్‌లో సిద్దిపేట అమర్‌నాథ్‌ సేవా సమితి అన్నదానం
-భక్తుల మన్ననలు అందుకుంటున్న సభ్యులు
సిద్దిపేట టౌన్‌ : అన్ని దానాలకన్న అన్నదానం మిన్న అనే అక్షరసత్యాన్ని సిద్దిపేట అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి నిజం చేస్తున్నది. ఎల్లలు దాటి మంచుకొండల్లో ఉత్తరాది వంటకాలను అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటుంది. ఈ నెల 9తేదీన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి కేదారినాథ్‌కు వెళ్లే ఆహార సరుకుల లారీని ప్రారంభించారు. సుమారు 10 రోజులుగా కేదారినాథ్‌ సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్‌ ఆధ్వర్యంలో యాత్రకు వచ్చే భక్తులకు పంచభక్ష పరమాన్నలను వడ్డిస్తున్నారు. సోన్‌ ప్రయాగ్‌ బేస్‌ క్యాంపులో జరుగుతున్న తెలుగువారి వంటకాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు. రోజువారీగా 5వేల నుంచి 6వేల వరకు భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. కేదారినాథ్‌కు మొట్టమొదటి సారిగా తెలుగు వంటకాలు అందించే లంగర్‌ మన సిద్దిపేట అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి కావడం గొప్ప విషయం. దక్షిణ భారతదేశం వంటకాలకు భోజన ప్రియులు ఎగబడుతున్నారు. ఉదయం ఇడ్లి, దోష, మసాల ఇడ్లి, పూరి, ఆలు పరోట, చాయ్‌ బిస్కెట్లు, మధ్యాహ్నం ఆవకాయ, రెండు రకాల వంటకాల కూరగాయలు సాంబరు, రోటి, మజ్జిగతో ఆహారాన్ని అందిస్తున్నారు. రాత్రి అల్పాహారం, భోజనం, ఒక పూట స్వీట్లు, ఒక పూట టీ యాత్రికులకు అదనంగా బలాన్ని ఇచ్చే బాదం పాలను అందిస్తున్నారు. 80మంది సేవా సమితి ప్రతినిధులు భక్తులకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...