భూసార పరీక్షలు తప్పక చేసుకోవాలి భూసార పరీక్షలు తప్పక చేసుకోవాలి భూసార


Thu,May 16, 2019 11:28 PM

ములుగు: రైతులు తమ పంటపొలాల్లో భూసార పరీక్షలు చేసుకొని ఆధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయాధికారి ప్రగతి అన్నారు. గురువారం మండల పరిధిలోని అడవిమజీద్‌ గ్రామంలో పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు మట్టి నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏవో ప్రగతి మాట్లాడుతూ... భూసార పరీక్షలు చేయడంతో భూమిలో నత్రజని, పొటాష్‌ తదితర పోషక విలువలు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకొని ఆ ఫలితం ప్రకారం తగిన మోతాదులో ఎరువులను వాడాలని రైతులకు సూచించారు.

అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు విధిగా రెండేండ్లకోసారి తప్పక భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఖరీఫ్‌ పంటల సాగుకొరకు ప్రభుత్వం 65శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలను అందిస్తుందన్నారు. ఖరీఫ్‌లో వరి పంటను సాగు చేసే రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు మల్లేశ్‌, పృద్వీ తదితరులు ఉన్నారు.

సహజ ఎరువుల వాడకంతో భూసారం పెంపుజగదేవ్‌పూర్‌: పచ్చిరొట్ట జీలుగు వంటి సహజ ఎరువుల వాడకంతో భూసారం పెంపొందుతుందని తద్వారా రైతులు అధిక పంట దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ ఎరువులతో పోలిస్తే తక్కువ ధరతో ఎక్కువ భూసారం పెంపుకు పచ్చిరొట్ట జీలుగు ఎంతో దోహద పడుతాయన్నారు. ప్రభుత్వమే రాయితీ ధరపై జీలుగు పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తుందన్నారు. 30 కిలోల జీలుగు విత్తనాల ధర రాయితీ పోను రూ.540 రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమ పొలం పాస్‌బుక్‌ జిరాక్స్‌, ఆధార్‌కార్డు నకలుతో వచ్చి మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...