పరిషత్ ఎన్నికలకు సిద్ధం


Sun,April 21, 2019 11:25 PM

- స్థానిక పోరుకు భారీ డిమాండ్
- దుబ్బాక నియోజకవర్గంలో 7 జడ్పీటీసీలు,69 ఎంపీటీసీ స్థానాలు...
- తొలి విడుతలో ఐదు మండలాల్లో ఎన్నికలు..
- 3వ విడుతలో రెండు మండలాల్లో ఎన్నికలు..
దుబ్బాక,నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావాహులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో మొత్తం 7 మండలాల్లో 7 జడ్పీటీసీలు, 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకారం ఆయా వర్గాలకు చెందిన నాయకులు పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు నిలిచి పోరాడేందుకు ఇతర పార్టీలు కనుచూపు మేర లేకుండాపోయాయి. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏ నాయకులు పోటీ చేయనున్నారో ఆసక్తిగా మారింది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో సర్వత్రా చర్చనీయంశంగా మారింది. దుబ్బాక నియోజకవర్గంలో 7 మండలాల్లో 149 గ్రామపంచాయతీలున్నాయి. ఇందుకు 7 జడ్పీటీసీలు, 69 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

తొలి విడుత మండలాలు....
దుబ్బాక నియోజక వర్గం భౌగోళికంగా రెండు జిల్లాలు, మూ డు డివిజన్ల అనుబంధంతో ముడిపడి ఉంది. నియోజక వర్గంలో 7 మండలాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలున్నాయి. ఇందులో సిద్దిపేట డివిజన్‌లోకి దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ మండలాలు ఉంటాయి. గజ్వేల్ డివిజన్‌లో రాయపోల్ మండలం ఉంది. మిగిలిన చేగుంట, నార్సింగ్ మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాదేశిక (పరిషత్) ఎన్నికల్లో తొలి విడుతలో సిద్దిపేట జిల్లాకు చెందిన 5 మండలాలు దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడుతలో మెదక్ జిల్లాలో ఉన్న చేగుంట, నార్సింగ్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుతలో జరిగే ఎన్నికలలో నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం కావడం తో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 3వ విడుతలో చేగుంట, నార్సింగ్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చేగుంటలో 13, నార్సింగ్‌లోని 5 ఎంపీటీసీలతో పాటు, రెండు మండలాల్లో జడ్పీటీసీలకు ఎన్నిక జరుగనున్నాయి.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...