స్వచ్ఛ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం


Sun,April 21, 2019 11:25 PM

-నూతన రెవెన్యూ చట్టాన్నిప్రజలు స్వాగతిస్తున్నారు
-మర్రిముచ్చాలలో శ్రమదానం
- పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
కొమురవెల్లి : స్వచ్ఛ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎ మ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మర్రిముచ్చాలలో సర్పంచ్ బొడిగం పద్మ ఆధ్వర్యం లో చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరితహారం కా ర్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కల చుట్టూ చె త్తాచెదారాన్ని తొలిగించడంతో పాటు ఎమ్మెల్యే స్వయంగా మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలిగించడంతో పాటు మొక్కల రక్షణకు సర్కారు తుమ్మ రెమ్మలను మొక్కల చుట్టూ కట్టారు. అనంతరం మొక్కలకు ఎమ్మెల్యే నీళ్లు పట్టారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలో పారిశుధ్యపనులు చేటపట్టిన వారికే టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని, వారిని ప్రజలు గుర్తించి గెలిపించారని, అదే విధంగా త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టిన వా రికే టికెట్లు అందజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, గత నాలుగున్నర సంవత్సరాలు సాగు, తాగునీరు వంటి అనేక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చి అమలు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.

ఎన్నో ఏండ్ల నుంచి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో తొలిగించేందుకు నూతన చట్టాన్ని రూపొందించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. రైతుల పన్నులను మాఫీ చేయడంతో పాటు రైతులకు తిరిగి పెట్టుబడికి సాయం అందిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని, దీనిపై దేశ ప్రధాని స్వయంగా పార్లమెంట్‌లో అన్న విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, మల్లన్న ఆలయ డైరెక్టర్ ముత్యం నర్సింలుగౌడ్, టీఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణాగౌడ్, రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్, మాజీ సర్పంచ్ వంగ రాణి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు ఏర్పుల మహేశ్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తలారి యాదయ్య, నాయకులు బొడిగం కృష్ణారెడ్డి, నీరటి నర్సింలు, చదరుపల్లి నర్సింగరావు, బత్తిని నర్సింలుగౌడ్, వంశీ, వంగ చంద్రారెడ్డి, తలారి తురాయి కనకయ్య, శిక బాలనర్సు, చుంచు గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...