సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి


Sun,April 21, 2019 11:25 PM

-హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం
-ఏపీతో పోల్చుకుంటే 200శాతం కూలీరేట్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
-ప్రమాదబీమా అమలుకు ప్రత్యేక ప్రణాళిక
-టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు
గజ్వేల్, నమస్తే తెలంగాణ/ గజ్వేల్ రూరల్ : సీఎం కేసీఆర్ కార్మికవర్గ పక్షపాతి అని టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అ ధ్యక్షుడు రాంబాబు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఆదివారం టీఆర్‌ఎస్‌కేవీ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రథమ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ముందుగా సివిల్ సప్లయి హమాలీ కార్మికులు టీఆర్‌ఎస్‌కేవీ ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌కేవీలో చేరారు. ఈ సందర్భంగా అతిథులు ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ కార్మికుల కష్టాలను ఉద్యమ సమయంలోనే గుర్తించారని, తెలంగాణ ఏర్పాటుతోనే ఒక్కో రంగంలో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారని తెలిపారు. హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు గురించి కూడా గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు వివరించామని, సీఎం కేసీఆర్ కూడా గతేడాది బోర్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులకు సూచించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పక్క రాష్ర్టాలతో పోల్చుకుంటే సివిల్ సప్లయ్ హమాలీలకు 200 శాతం కూలీ రేటు పెరిగిందన్నారు.

గతంలో రూ.7లు చెల్లించిన కూలీని ప్రస్తుతం రూ.18లుగా చెల్లిస్తున్నారని తెలిపారు. ఏపీలో పాత కూలీ రేట్లే కొనసాగుతున్నాయన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరితో పాటు హమా లీ కార్మికులకు కూడా ప్రమాదబీమా వర్తింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.5 లక్షల ప్రమాదబీమా ఇచ్చిన ఘన త సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఆటోలకు లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేసి ఆటోకార్మికుల జీవితాలకు అండగా నిలిచారని చెప్పా రు. భవన నిర్మాణ కార్మికులకు రూ.7లక్షల ప్రమాదబీమా ను సీఎం కేసీఆర్ ప్రారంభించి వారి జీవితాలకు బాసటగా మారారన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ కార్మికులకు వేతనాలు పెంచారని, ఇలా అన్ని రంగాల కార్మికులను అభివృద్ధి చేయడానికి సీఎం సంకల్పించారన్నారు. రూ.84కోట్ల లైఫ్‌ట్యాక్స్ భారాన్ని ఆటో కార్మికులకు తప్పించారని పేర్కొన్నారు.

సివిల్ సప్లయి కార్మికులు ఉమ్మడి జిల్లాలో 400ల మంది, రాష్ట్రంలో 5వేల మంది ఉన్నారని, వారందరికీ టీఆర్‌ఎస్‌కేవీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నిరంగాల కార్మికులకు రాష్ట్త్రంలో ఒకే కార్మిక సంఘం ఉండాలని టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు.
కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎజాజ్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా గౌరవాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్, ప్రధాన కార్యదర్శి పెర్క శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా సివిల్ సప్లయి హామాలీ సంఘం అధ్యక్షుడు బి.రాజయ్య, కార్యదర్శి బాబుమియా, సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పరశురాములు, శ్రీనివాస్, రవీందర్, సాయిలు, గజ్వేల్ బాధ్యులు సాజిద్, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...