రామసముద్రానికి నయా శోభ


Sun,April 21, 2019 11:24 PM

దుబ్బాక టౌన్ : సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన రా మసముద్రం చెరువు కొత్త శోభను సంతరించుకుంటున్నది. రూ. 10 కోట్లతో సుందరీకరణ పనులను చేపట్టా రు. రామ సముద్రం చెరువు దుబ్బాక పట్టణానికే అందాన్ని ఇస్తున్నది. రాష్ట్రంలోనే మంచి పర్యాటక కేం ద్రంగా తీర్చిదిద్ది సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నదే తన ధ్యేయమని, అందుకే అధునాతన హంగులతో చెరువు కట్టను అభివృద్ది చేస్తున్నామని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రామసముద్రం చెరువు పట్టణ ప్రజలకే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సేదతీరేందుకు తగిన వసతులను కల్పిస్తున్నారు. చెరువులో రూ. 20 లక్షల నిధులతో రెండు బోట్లను బోటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్తగా వాకింగ్ కోసం ట్రాక్‌ను ఏర్పాటు చేయగా పనులు పూర్తి కావలసి ఉంది. టూరిజం శాఖ నుంచి చెరువు కట్టపై పలు రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెరువు కట్టపై నూతనంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. 13 విభాగాల్లో వ్యాయామం చేసే విధంగా పిల్లలకు, పెద్దలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 6న జరిగే ప్రాదేశిక ఎన్నికలు ముగియగానే ఈ ఓపెన్ జిమ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అందమైన పూలమొక్కలు, గ్రీన్‌గ్రాస్, స్టీల్‌రేలింగ్, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ మెట్లు వంటి సౌకర్యాలతో దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడుతున్నది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...