పరిషత్ పోరుకు మోగిన నగారా


Sat,April 20, 2019 11:38 PM

- జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు
- తొలివిడుత సిద్దిపేట, రెండోవిడుత గజ్వేల్ డివిజన్, మూడోవిడుత హుస్నాబాద్ డివిజన్‌తోపాటు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో..
- పార్టీల గుర్తులపై, బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు
- సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ
- మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు
- మే 6,10,14 తేదీల్లో పోలింగ్.. మే 27న ఓట్ల లెక్కింపు
- అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
- జడ్పీటీసీ గరిష్ట వ్యయపరిమితి రూ.4 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు
- జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్థానిక సంస్థల్లో కీలకమైన జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగనుండగా..తొలివిడుత మే 6న సిద్దిపేట డివిజన్, రెండోవిడుత మే 10న గజ్వేల్ డివిజన్ పరిధిలో, మూడో విడుత మే 14న హుస్నాబాద్ డివిజన్‌లో పోలింగ్ జరగనుంది. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం 27న పరిషత్ ఓట్లను లెక్కిస్తారు. జిల్లావ్యాప్తంగా 23 జడ్పీటీసీ, 229 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎంపీటీసీకి, జడ్పీటీసీకి వేర్వేరు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. సోమవారం నుంచి తొలివిడుత నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు స్వీకరిస్తారు. షెడ్యూల్ విడుదల కావడంతో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జడ్పీటీసీ స్థానానికి గరిష్ట వ్యయపరిమితి రూ.4 లక్షలు, ఎంపీటీసీ స్థానానికి రూ.1.50 లక్షలుగా నిర్దేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 23 జడ్పీటీసీలు, 229 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రేపు (సోమవారం 22వ తేదీ) విడుదల చేసి, మే 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 26న రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మే 10న పోలింగ్, తుది దశ ఎన్నికల నోటిఫికేషన్ 30న విడుదల చేసి మే 14న పోలింగ్ నిర్వహిస్తారు. మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలు ముగించి, మే 27న ఓట్ల లెక్కింపు చేపడుతారు. జడ్పీటీసీ స్థానానికి గరిష్ఠ వ్యయపరిమితి రూ.4 లక్షలు, ఎంపీటీసీ స్థానానికి గరిష్ఠ వ్యయపరిమితి రూ.1.50 లక్షలు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎంపీటీసీకి, జడ్పీటీసీకి వేర్వేరు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. ఆయా మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు స్వీకరిస్తారు. నేటి నుంచే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇటీవల కొత్తగా నారాయణరావుపేట మండలం ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఈ మండలం ఎంపీపీ స్థానాన్ని జనరల్ (పురుషుడు/మహిళ)కు, జడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. జిల్లాలో మొత్తం 6,12,393 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 1,320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తొలి దశలో సిద్దిపేట డివిజన్‌లోని 10 మండలాల్లో మొత్తం 96 ఎంపీటీసీ స్థానాలు, 10 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. 2,57,306 మంది ఓటర్లున్నారు. 539 పోలింగ్ కేంద్రాలు, రెండో దశలో గజ్వేల్ డివిజన్‌లోని ఆరు మండలాల్లో 64 ఎంపీటీసీలకు, ఆరు జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 1,72,105 మంది ఓటర్లుండగా, 388 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడవ దశలో హుస్నాబాద్ డివిజన్‌తో పాటు సిద్దిపేట డివిజన్‌లోని రెండు మండలాలు కలుపుకొని ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడు జడ్పీటీసీలు, 69 ఎంపీటీల స్థానాల్లో మొత్తం 1,82,982 మంది ఓటర్లున్నారు. వీరి కోసం 393 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...