కస్తూర్బాలో ఆంగ్ల మాధ్యమం


Sat,April 20, 2019 11:35 PM

రాయపోల్:వచ్చే విద్యా సంవత్సరం నుంచి కస్తూర్బా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన ప్రారంభం కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి, 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ ప్రాజెక్టు డైరెక్టరేట్ నుంచి ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ఇప్పటివరకు తెలుగు మాధ్యమంలోనే బోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రారంభం కానున్నడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 97 పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 22 కస్తూర్భాగాంధీ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 17 పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం కొనసాగుతున్నది. మరో 5 పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నిర్వహించనున్నారు.

జిల్లాలోని 22 కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో 3,800 మంది విద్యార్థులు ఈవిద్యా సంవత్సరం విద్యనభ్యసించారు. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ప్రారంభంకానున్నది. గతంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలల్లో కేవలం తెలుగు మీడి యం మాత్రమే ఉండేది. రాయపోల్ మండల కేం ద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో ఇప్పటికే ఆంగ్లబోధన తరగతులు కొనసాగుతున్నాయి. తెలుగు మీడియం ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ఆంగ్లబోధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం అదేశాలు ఇవ్వడంతో దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల్లో 202 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...