ప్రాదేశిక ఎన్నికల సందడి


Fri,April 19, 2019 11:24 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండడం తో ఆశావాహులు పోటీ చేసేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న నాయకులు.. పోటీ చేసేందుకు రంగం సిద్ధ్దం చేసుకుంటున్నారు. కొంతకాలంగా వివిధ పార్టీల్లో పెద్ద నాయకులను కలుస్తూ... టికెట్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆరు నెలలుగా శాసనసభ ఎన్నికల నుంచి పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. వరుస ఎన్నికలతో నేతలు తీరిక లేకుం డా ఉన్నారు. మరో పక్క ప్రాదేశిక ఎన్నికల్లో ఆశావాహులు పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ మండలాలు ఉన్నాయి. ఇందులో నూతనంగా ఏర్పాటైన రాయపోల్, నార్సింగ్ మండలాల్లో ఎంపీపీ పదవి కోసం నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో 69 ఎంపీటీసీ స్థానాలున్నాయి. దుబ్బాక మండలంలో 13, మిరుదొడ్డి -11, తొగుట-09, దౌల్తాబాద్ -10, రాయపోల్ -08, చేగుంట-13, నార్సింగ్ -05 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

దుబ్బాకలో 13 ఎంపీటీసీలు... మండలంలోని 30 గ్రామపంచాయతీలకు 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 35,209 మంది ఓటర్లున్నారు.

రిజర్వేషన్ల వివరాలు..
ఆకారం- జనరల్ (మహిళ), అప్పనపల్లి- జనరల్(మహిళ), చీకోడ్-జనరల్, చిన్ననిజాంపేట-బీసీ(మహిళ), చిట్టాపూర్- బీసీ(జనరల్), ఎనగుర్తి-బీసీ(మహిళ), గంభీర్‌పూర్-జనరల్ (మహిళ), హబ్షీపూర్- ఎస్సీ(జనరల్), పెద్దగుండవెళ్లి-జనరల్, పోతారెడ్డిపేట-ఎస్సీ(జనరల్), రాజక్కపేట- బీసీ(జనరల్), రామక్కపేట-ఎస్సీ (మహిళ), తిమ్మాపూర్- జనరల్ కేటాయించారు. మండలంలో మొత్తం 67 పోలింగ్ కేంద్రాలున్నాయి.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...