సీఎం సహాయనిధి పేదలకు వరం : ఎమ్మెల్యే సోలిపేట


Fri,April 19, 2019 11:24 PM

దుబ్బాక టౌన్ : అనారోగ్యంతో ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్ పథకం వరంగా మారిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాకకు చెందిన దొమ్మాట కవిత ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోలిపేటకు టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆస స్వామి వివరించారు. దీంతో కవిత వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ కింద లక్ష రూపాయల ఎల్‌వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు శుక్రవారం దుబ్బాకలో బాధితురాలి భర్త యాదయ్యకు ఎల్‌వోసీని ఎమ్మెల్యే సోలిపేట అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆస స్వామి, రొట్టె రమేశ్, గుండెల్లి ఎల్లారెడ్డి, కట్కూరి రాంచంద్రం, బండి రాజు, పోలబోయిన నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అనుగుణంగా ఫంక్షన్ హాల్ ఉండాలి
మిరుదొడ్డి : గ్రామీణ ప్రజలకు ఫంక్షన్ హాల్ సౌకర్యవంతంగా ఉండేలా యజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మిరుదొడ్డిలో నూతన నిర్మించిన సాయిబాలాజీ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ...మండలకేంద్రంలో ఫంక్షన్ హాల్‌ను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. పేదప్రజలపై సాయిబాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాల్ యజమాన్యం కొంత ఉదారత చూపి, తక్కువ ధరకు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత పం జాల శ్రీనివాస్‌గౌడ్, మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ రంగమైన రా ములు, ఎంపీటీసీ గొట్టం బైరయ్య, యజమాన్యం రాజు, శ్రీనివాస్, రాజు, రవీందర్, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ బోయ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ జిల్లా మానీటరింగ్ కమిటీ సభ్యుడు ఎర్మని దుబ్బరాజం పాల్గొన్నారు.

ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ఆదుకుంటుంది..
మిరుదొడ్డి / రాయపోల్ : సీఎంఆర్‌ఎఫ్ నిధులు పేదప్రజలను ఆపద సమయంలో ఆదుకుంటున్నాయని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మిరుదొడ్డిలో దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన రమేశ్‌కు వైద్యచికిత్సల నిమిత్తం రూ.4 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, స్థానిక నాయకుడు జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...