కాల్వల భూసేకరణకు రైతులు సహకరించాలి


Fri,April 19, 2019 11:24 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : కాల్వల భూ సేకరణ కోసం సహకరించాలని, నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు క్రిష్ణభాస్కర్, వెంకట్రామరెడ్డి తెలిపారు. రైతుల త్యాగాలు వెలకట్టలేనివని, కాల్వల భూ సేకరణకు సహకరించిన నిర్వాసితులను ప్రభు త్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. దేశంలో ఎక్క డా లేని విధాంగా రికార్డు స్థాయిలో సిద్దిపేట జిల్లాలో భూసేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డిలతో కలిసి గజ్వేల్ మండలంలోని గౌరారం గ్రామస్తులతో కాల్వల భూసేకరణ పై కలెక్టర్లు, అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా గజ్వేల్ మండలంలోని గౌరారం గ్రామం మీదుగా సుమారు 80 ఎకరాల మేర భూ సేకరణ చేయాల్సి ఉన్నదని, ఈ కాల్వల నిర్మాణంతో వేలాది ఎకరాల భూమికి సాగునీరు అందనున్నదని కలెక్టర్లు వివరించారు. ప్రభుత్వం చేసే విధివిధానాల్లో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీల కింద ఎక్కువ నష్ట పరిహారాన్ని అందిస్తున్న జిల్లా కేవ లం సిద్దిపేట మాత్రమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తు న్న నియోజక వర్గం, జిల్లా కాబట్టి జిల్లాలో రైతు శ్రేయస్సు కోసం సాగునీటి రిజర్వాయర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విధి విధానాలకు అనుగుణంగా.. చట్టాలకు లోబడి చేయాల్సిన భూ సేకరణ చేస్తున్నామని, పరిమితిలోపు న్యాయం చేస్తున్నామని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం మన జిల్లాలో నిర్మిస్తున్న జలాశయాలు భవిష్యత్ ప్రయోజనాల దృష్టా ఎంతో ప్రయోజనం చేకూరనున్నదని, ఇందుకోసం మిమ్మల్ని ఒప్పించి చేస్తేనే.. మీకు మాకు సం తోషమని గౌరారం నిర్వాసితులకు కలెక్టర్లు వివరించారు.

రిజర్వాయర్ల నిర్మాణానికి సహకరిస్తే గ్రామాలకు లాభం చేకురుతుందని పేర్కొన్నారు. ఇతర అవసరాలకు అనుగుణంగా గ్రామాభివృద్దికి తోడ్పటును అందిస్తానని తెలిపారు. వారం రోజులోపు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో నిర్వాసితులంతా చర్చించుకుని, ప్రభుత్వానికి సహకరించాలని కోరా రు. సమావేశంలో గౌరారం గ్రామస్తులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...