మస్కట్‌లో జక్కాపూర్‌వాసి మృతి


Thu,April 18, 2019 11:13 PM

చిన్నకోడూరు : పొట్టకూటి కోసం దేశం కానీ దేశం వెళ్లాడు.. గ్రామంలో కూలీ పని చేసుకుందామంటే దొరికే పరిస్థితి లేదు.. కుటుంబాన్ని, పిల్లలకు మంచి చదువులు అందించాలనే తాపత్రయంతో పదేండ్ల నుంచి మస్కట్‌కు పోయి వస్తున్నా డు. సిద్దిపేట రూరల్ మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యలా ఎల్లారెడ్డి (39) మస్కట్‌లో పనిచేస్తున్నాడు. కాగా, పని చేసే కంపెనీ సమీపంలో ఉన్న గదిలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో మం చంపై నుంచి కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కూలీ సమీపం లోని ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ వారం రోజుల కిందట ఎల్లారెడ్డి మృతి చెందాడు. ఈ విషయం కుటుంబానికి తెలియడంతో తీవ్ర విషాధం నెలకొంది. మస్కట్‌లో ఉన్న జక్కాపూర్ వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎల్లారెడ్డి.. పదేండ్ల నుంచి మస్కట్‌కు స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పనిచేస్తున్న సమీపంలో కంపెనీ యజమాన్యం కూలీలకు వసతి సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఎల్లారెడ్డికి సంబంధించిన రూములో ఆయనతో పాటు రుద్రంగి వాసి ఇద్దరు కలిసి ఉంటున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎల్లారెడ్డి మంచంపై నుంచి కింద జారిపడ్డాడని రుద్రంగి వాసి తెలిపాడన్నారు. వెంటనే ఎల్లారెడ్డిని ఆసుపత్రికి తరలించించడంతో మెడ నరాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారన్నారు. ఎల్లారెడ్డి వా రం రోజులుగా కోమాలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని జక్కాపూర్ గ్రామానికి చెం దిన కిషన్, రమేశ్ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించగా, అప్పటికే ఎల్లారెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని మస్కట్ నుంచి కిషన్, రమేశ్‌లు మృతుడి కుటుంబానికి సమాచారాన్ని అందించారు. దీంతో ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎల్లారెడ్డికి భార్య ఇందిర, కుమారుడు అరవింద్‌రెడ్డి, కూతురు అక్షయలు ఉన్నారు.

కడచూపు కోసం కుటుంబీకుల ఎదురుచూపు..
మాకు దిక్కెవరు లేరు.. మా భర్త మస్కట్‌లో మంచంపై నుంచి పడిపోయిండని తెలువగానే గుండెలు అవిశిపోయే లా ఏడుస్తున్నం.. పది రోజుల నుంచి ఎల్లారెడ్డి కడచూపు కోసం పిల్లలందరూ వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు. మృతదేహం ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలువని పరిస్థితి.. అప్పులు తీర్చడానికి దేశం కానీ దేశం పోయిండు.. రెండు వారాల కింద ఫోన్‌లో మాట్లాడాడు.. అవే చివరి మాటలని భార్య ఇందిర బోరున విలపించింది. నా భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకరావాలని వేడుకుంటుంది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...