ఇంటర్ ఫలితాలు విడుదల


Thu,April 18, 2019 11:12 PM

సిద్దిపేట రూరల్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం విడుదల చేశారు. ప్రతి సంవత్సరంలాగే అన్ని విభాగాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15 వ స్థానంలో నిలిచింది. కాగా గత సంవత్సరం ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 11వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం తగ్గి 15వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత సంవత్సరం 12వ స్థానంలో నిలువగా ఈ సంవత్సరం 15 వ స్థానంలో నిలిచింది.

ఎన్సాన్‌పల్లి గురుకుల కళాశాలలో...
సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని గురుకుల బాలికల కళాశాలలో ఈ విద్యాసంవత్సం ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించామని కళాశాల ప్రిన్సిపాల్ కె.విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 96 శాతం, ద్వితీయ సంవత్సరంలో 97 శాతం ఫలితాలు సాధించామన్నారు. ఈ మేరకు అత్యుత్తమ మార్కులు సాధించిన బాలికలను అభినందించారు.

2018-19 సంవత్సరం జనరల్, ఒకేషనల్ విభాగాల
ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు..

ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం : 52.0 % (జనరల్ విభాగం) మొత్తం విద్యార్థుల హాజరు : 8,511, ఉత్తీర్ణత : 4386, బాలురు.... హజరు :3515, ఉత్తీర్ణత :1338, శాతం : 38 %, బాలికలు.. హజరు :4996, ఉత్తీర్ణత :3048, శాతం :61.0 %, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం : 60 % (జనరల్ విభాగం), మొత్తం విద్యార్థుల హాజరు : 8065, ఉత్తీర్ణత : 4847, బాలురు.. , హాజరు :3362, ఉత్తీర్ణత :1658, శాతం :49%, బాలికలు..హాజరు :4703, ఉత్తీర్ణత :3189, శాతం : 60.0%, ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం : 42.0 % (ఒకేషనల్ విభాగం), మొత్తం విద్యార్థుల హాజరు : 3236, ఉత్తీర్ణత : 1369, బాలురు... ,హజరు :1900 ,ఉత్తీర్ణత :574 ,శాతం : 38 % ,బాలికలు.. , హాజరు :1336 , ఉత్తీర్ణత :795, శాతం :60.0 %, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం : 55 % (ఒకేషనల్ విభాగం), మొత్తం విద్యార్థుల హాజరు : 2605, ఉత్తీర్ణత : 1443, బాలురు.... , హాజరు :1575, ఉత్తీర్ణత :704, శాతం :45%, బాలికలు.. , హాజరు :1030, ఉత్తీర్ణత :739, శాతం : 55.0%
సత్తా చాటిన దుబ్బాక విద్యార్థులు

దుబ్బాక టౌన్: దుబ్బాక ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల సెకండియర్ ఎంపీసీ (ఇంగ్లీషు)విద్యార్థులు వెయ్యి మార్కులకుగాను సీహెచ్ సంధ్య 980 మార్కులు సాధించగా బైపీసీ (ఇంగ్లీషు) విభాగంలో పి.భావన 977, సీఈసీ (ఇంగ్లీషు)విభాగంలో ఎ.పూజ 960 మార్కులు సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో ఎంపీసీ (ఇంగ్లీషు)విభాగంలో 470 మార్కులకు గాను జి.నితిన్‌రెడ్డి 464, కె.ప్రణీత 461 మార్కులు సాధించగా, బైపీసీలో (ఇంగ్లీషు) 440 మార్కులకుగాను బి.ప్రగతి 429, సీఈసీ (ఇంగ్లీషు) విభాగంలో ఎం.నవీన్ 448 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్‌రావు తెలిపారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన తొగుట జూనియర్ కళాశాల
తొగుట: తొగుట సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 35/39, బైపీసీలో 40/40 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 31/32, బైపీసీలో 39/39 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ మెర్సీ వరూధిని శుభాకాంక్షలు తెలిపారు.

తొగుట జూనియర్ కళాశాలలో....
ఇంటర్ ఫలితాలలో తొగుట జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 94.07 శాతం పాస్ అయ్యారు. ఎంపీసీలో ఆంగ్ల, తెలుగు మాద్యమాలలో కలిపి 23/23, బైపీసీలో 33/34, సీఈసీలో 22/22, హెచ్‌ఈసీలో 15/17 మంది పాస్ అయ్యారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ పరమేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

గజ్వేల్‌రూరల్: గురువారం వెలువడిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ కోర్సు ఫస్ట్ ఇయర్‌లో జాన్సన్ 443/470, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియంలో కిరణ్ 942/1000, తెలుగుమీడియంలో సతీష్ 927/1000 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ సెకండ్‌ఇయర్‌లో చందు 889/1000, ఫస్ట్ ఇయర్‌లో కృష్ణ 373/440లు అత్యధికంగా మార్కులు సాధించారు. అలాగే సీఈసీ సెకండ్ ఇయర్‌లో శ్రీధర్ 741/1000, ఫస్ట్ ఇయర్‌లో యాదగిరి 429/500, హెచ్‌ఈసీ సెకండ్ ఇయర్‌లో బాబు 698/1000 మార్కులు సాధించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...