మెట్టపై అకాల దెబ్బ


Thu,April 18, 2019 11:12 PM

- హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో వడగండ్ల బీభత్సం
- మద్దూరు, కొమురవెల్లిలో కురిసిన వర్షం
- తీవ్రంగా దెబ్బతిన్న మామిడి, వరి పంటలు
- నేలకూలిన భారీ వృక్షాలు, హోర్డింగులు, రేకుల షెడ్లు
- విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
- అంధకారంలో పలు గ్రామాలు
- గోవర్ధనగిరిలో పిడుగుపాటుకు రైతు మృతి

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : మెట్ట ప్రాంత మండలాలైన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా పెనుగాలులతో ప్రారంభమైన భారీ వర్షంతో పాటు వడగండ్లు కూడా తీవ్ర స్థాయిలో పడ్డాయి. పెనుగాలులకు పెద్ద పెద్ద వృక్షాలతో పాటు మామిడి చెట్లు విరిగిపడ్డాయి. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన చిల్పూరి మహేందర్‌రెడ్డి(32)అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామ సమీపంలోకి పనికోసం వెళ్లిన మహేందర్‌రెడ్డి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయా మండలాల్లోని ప లు గ్రామాల్లో రేకులషెడ్లు గాలికి ఎగిరిపోవడం వల్ల కొన్ని కుటుంబాల వాళ్లు నిరాశ్రులయ్యారు. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షం ఈ మూడు మండలాల్లోని రైతులను కోలుకోకుండా చేసింది.

ముఖ్యంగా మామిడితోటల్లోని కాయలు పూర్తిగా రాలిపోయాయి. చేతికందే దశలో ఉన్న వరిపంట సైతం వడగండ్లకు పూర్తిగా ధ్వంసమైంది. కోహెడ మండలంలోని చెంచల్‌చెర్వుపల్లి, సముద్రాల, శ్రీరాములపల్లి, కోహెడ క్రాసిం గ్, నాగసముద్రాల తదితర గ్రామాల్లో వండగండ్లు బీభత్సం సృష్టించాయి. అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి, రేగొండ, ధర్మారం, నందారం, రామవరం తదితర గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి, పందిల్ల, పొట్లపల్లి, హుస్నాబాద్ పట్టణం, నాగారం, మహ్మదాపూర్ తదితర గ్రామాల్లో పెనుగాలులు, భారీ వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. కూచనపల్లి గ్రామ శివారులోని హన్మంతరెడ్డి అనే రైతుతో పాటు ఇతర రైతుల వరిపంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఆయా గ్రామాల్లో వృక్షాలు విరిగి ఇండ్లపై పడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలో పలు భవనాలపై ఉన్న హోర్టింగులు విరిగిపడ్డాయి. పలు కాలనీల్లో విద్యుత్ స్థంభాలు నేలకులాయి. దీంతో ఆయా కాలనీలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో సైతం విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రెండు రోజులుగా కురిసిన భారీ వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న మామిడి తోటలు, వరిపంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

కొమురవెల్లి మండలంలో...
కొమురవెల్లి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పోసాన్‌పల్లిలో కూర మల్లయ్యకు చెందిన ఇంటిపై కప్పు రేకులు లేచి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘనలో ఇంట్లో ఉన్న పాల సామగ్రి ధ్వసమైంది. దీంతో సుమారు 40 వేల వరకు నష్టం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ బూర్గు కొండమ్మ కోరారు.

పిడుగుపాటుకు పాడిబర్రె మృతి...
మద్దూరు: మండలంలోని బైరాన్‌పల్లిలో గొర్ల మల్లేశానికి చెందిన పాడిబర్రె గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తన వ్యవసాయ బావి వద్ద మేత మేస్తున్న బర్రెపై పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో బర్రె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. బర్రె విలువ సుమారు రూ. 70 వేలు ఉంటుందన్నారు. బర్రె మృతితో జీవనోపాధిని కోల్పోయిన తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కాగా మృతిచెందిన బర్రె వద్ద రైతు కుటుం బం రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...