నేడు పాలిసెట్


Tue,April 16, 2019 01:09 AM

నంగునూరు : నేడు జరిగే ఇంజినీరింగ్ డిప్లొమా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకొని 2018 - 19 విద్యా సంవత్సరానికి పాలిసెట్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు సిద్దిపేట పట్టణంలోని 6 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో 2,336 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1హెచ్‌బీ పెన్సిల్, పెన్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష హాల్‌లోకి అనుమతించరన్నారు. జవాబులన్నీ ఓఎంఆర్ సైడ్ 1లో పెన్సిల్‌తో గుర్తించాలి. ఓఎంఆర్ సైడ్ 2లో పెన్నుతో సంతకం చేయాలి.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...