కనుల పండువగా సీతారాముల కల్యాణం


Mon,April 15, 2019 12:03 AM

-జిల్లావ్యాప్తంగా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
-పలు చోట్ల పాల్గొన్న ఎమ్మెల్యేలు సోలిపేట, ముత్తిరెడ్డి, సతీశ్‌కుమార్
-అన్నింటా విజయం కలుగాలి : ఎమ్మెల్యే హరీశ్‌రావు
-పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
సిద్దిపేట టౌన్ : సీతారామచంద్రస్వామి అనుగ్రహంతో అన్నింటా విజయం కలుగాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్వామివారిని ప్రార్థించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టణంలోని రామాలయం, హనుమాన్ దేవాలయాలు, శివాలయాల్లో జరిగిన సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఆశీర్వచనాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట మరింత పచ్చని పట్టణంగా చేసుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే చెట్లు నాటడంలో ఎంతో ప్రగతిని సాధించామని, మరిన్ని మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందన్నారు. చెట్లను నరకవద్దని ఆయన సూచించారు.

ఇటీవల కొన్ని చెట్లను నరకడం తన దృష్టికి వచ్చిందని, వేసవి కాలం వస్తే చెట్టు విలువ మనకు తెలుస్తుందని చెప్పారు. నాటిన మొక్కలను సంరక్షణ బాధ్యత అం దరూ తీసుకోవాలని ప్రతిఒక్కరూ ముమ్మరంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో అంబికా అగర్‌బత్తి వారు తయారు చేయబడిన 10 ఫీట్ల అగర్‌బత్తిని ఎమ్మెల్యే హరీశ్‌రావు వెలిగించారు. సుమారు 36గంటల పాటు ఈ అగర్‌బత్తి వెలుగుతుందని ప్రముఖ వ్యాపారి అయిత నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, కెమ్మసారం ప్రవీణ్, బాసంగారి వెంకట్, నాయకులు పాల సాయిరాం, మోహన్‌లాల్, కొండం సంపత్‌రెడ్డి, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.

ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి..
సిద్దిపేట అర్బన్: ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని, సీతారామచంద్ర స్వామి కృపతో సిద్దిపేట మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి మధిర రేణుకానగర్, 28వ వార్డు, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సిద్దిపేటలో మొక్కల పెంపకం పెద్దఎత్తున చేపట్టి ఆకుపచ్చ సిద్దిపేటగా రూపుదిద్దే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయరాణి శ్రీనివాస్‌గౌడ్, 28 వార్డు కౌన్సిలర్ కంటెం లక్ష్మిరాజు, 1వ వార్డు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, బెజ్జంకి బాపురెడ్డి, శ్రీనివాస్, గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, తదితరులు ఎమ్మెల్యే హరీశ్‌రావును శాలువాకప్పి ఘనంగా సన్మానించారు.

శ్రీలక్ష్మీరంగనాయకస్వామి గుట్టపై..
చిన్నకోడూరు : చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని శ్రీలక్ష్మీరంగనాయకస్వామి గుట్టపై జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నకోడూరు శేరిపల్లి హనుమాన్ దేవాలయ కమాన్‌ను ప్రారంభించారు. ఆలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, ప్రముఖ వైద్యుడు రామచందర్‌రావు, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సొసైటీ చైర్మన్లు బాల్‌రెడ్డి, పాపయ్య, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కనకరాజు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...