జై భీమ్


Mon,April 15, 2019 12:02 AM

-ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి
-పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
-అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి : ఎమ్మెల్యే హరీశ్‌రావు
-బాబాసాహెబ్ కృషి చిరస్మరణీయం: కలెక్టర్ కృష్ణభాస్కర్
-నివాళులర్పించిన ప్రముఖులు, అధికారులు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆదివారం జరిగిన 128వ జయంతి ఉత్సవ వేడుకలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ జోయల్ డెవిస్, జేసీ పద్మాకర్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా అంబేద్కర్‌ను రాజకీయంగానే గుర్తు చేసుకుంటామని, ఆర్థిక వేత్తగా అంబేద్కర్ రిజర్వ్ బ్యాంకును 1935లో స్థాపించినప్పుడు ముగ్గురిలో అంబేద్కర్ ఒకరన్నారు. మొట్టమొదటి మంచినీటి ప్రాజెక్టు అయిన బక్రానంగల్ డ్యామ్‌ను దానిని సామరస్యంగా తీసుకురావాలని ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు.

దేశంలోని మొదటి క్యాబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడు లేనట్లుగా మొదటిసారిగా హిందూ కోడ్ బిల్లును అమలయ్యే విధంగా కృషి చేశారన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జీవితాంతం నిత్య విద్యార్థిగా భావించి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న చలించకుండా తన చదువును కొనసాగించిన మహానీయుడన్నారు. తాను పడ్డ కష్టం ఎవరికీ రాకూడదని పరితపించి అందరూ సమానంగా ఉండే సమాజం కోసం దేశ ప్రజలంతా ఒకే బాటలో నడిచేలా భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. సీపీ జోయల్ డెవిస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు. అంతకు ముందు కలెక్టర్ కృష్ణభాస్కర్, సీపీ జోయల్ డెవిస్, జేసీ పద్మాకర్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ చరణ్‌దాస్, ఆర్డీవో జయచంద్రారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జీవరత్నం, డీపీవో సురేశ్‌బాబు, టీఎన్‌జీవో అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, దళిత సంఘాల నాయకులు రామస్వామి, ఆస లక్ష్మణ్, గ్యాదరి కుమార్, పెర్క బాబు, రాజేందర్, బాల్‌రాజు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పట్టణంలో ర్యాలీ
అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో యువకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధులన్నీ జై భీమ్ నినాదాలతో మార్మోగాయి. పాత బస్టాండ్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ సర్కిల్, గాంధీ చౌరస్తా, కమాన్, నర్సాపురం చౌరస్తాతోపాటు పట్టణంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న
ఎమ్మెల్యే హరీశ్‌రావు
దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి. సమాజంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంట మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కెమ్మసారం ప్రవీణ్, గ్యాదరి రవీందర్, నాయకులు సాకి ఆనంద్, ఏటి రామస్వామి, ఆస లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...