గులాబీ దళపతి వస్తున్నారు


Sat,March 23, 2019 11:30 PM

- ఉమ్మడి మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు
- ఏప్రిల్ 3న బహిరంగ సభలు
- అందోలులో సాయంత్రం 4గంటలకు..
- నర్సాపూర్‌లో సాయంత్రం 5.30గంటలకు..
- రెండు లక్షల మందిని తరలించడానికి సన్నాహాలు
- ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ శ్రేణులు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలు ఖరారయ్యాయి. శనివారం రాత్రి పార్టీ అధిష్టానం సీఎం పాల్గొనే ఎన్నికల బహిరంగ సభ స్థలాలను ప్రకటించింది. ఏప్రిల్ 3న రెండు సభల్లో సీఎం పాల్గొంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలున్న విషయం తెలిసిందే. జహీరాబాద్ పార్లమెంట్ నియోజవర్గానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా అందోలులో, మెదక్ పార్లమెంట్‌కు సంబంధించి మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం సభలున్నాయి. మొదటి సభ అందోలులో సాయంత్రం 4 గంటలకు, రెండో సభ నర్సాపూర్‌లో 5.30 గంటలకు ఉంటుంది. ఆయా సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే నర్సాపూర్ సభకు సంబంధించి సభా స్థలిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. సీఎం ఎన్నికల ప్రచార బహిరంగ సభలకు ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపుగా 30వేల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఒక్కో బహిరంగ సభకు 2 లక్షలకు పైగా ప్రజలు తరలివచ్చేలా అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయనున్నారు. పెద్దఎత్తున ప్రజలను తరలించి సీఎం కేసీఆర్ బహిరంగ సభలకు గ్రాండ్ సక్సెస్ చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...