ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే..


Sat,March 23, 2019 11:26 PM

దుబ్బాక టౌన్ : రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైనా ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సోలిపేట సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎండీ. గూడ్‌సాబ్, బొంగురం ఎల్లారెడ్డి, బొంగురం నారాయణరెడ్డి, సిరిగిరి శ్రీనివాస్, రాములు, ఎండీ.హుస్సేన్, మదర్, ఎండీ.షాదుల్‌తోపాటు 20మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ టీడీపీల నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కాం గ్రెస్ ఇక ఖాళీయేనని అన్నారు. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం, విశ్వాసం లేకనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డిని మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని ప్రజలందరి సహకారంతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, చీకోడ్ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేడు దుబ్బాకలో చేరికలు..
ఆదివారం దుబ్బాకలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తల చేరికలు ఉంటాయని టీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆసస్వామి తెలిపారు. ఉదయం 9గంటలకు జరిగే కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 200మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...