బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


Sat,March 23, 2019 12:28 AM

- తండ్రీ కొడుకుల మరణం కలిచివేసింది
- రవీందర్ కుటుంబానికి అండగా ఉంటాం
- ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

తొగుట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం చెందడం తననెంతో కలిచివేసిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెం డు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎ ల్లారెడ్డిపేటకు చెందిన తండ్రీ కొడుకులు బోగ రవీంద ర్, కృష్ణసాయి కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప రామర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారి కు టుంబానికి ఆర్థిక సాయం అందించారు. రాణి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గం టా రేణుక, మండల పార్టీ అ ధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఏల్పుల స్వామి, స ర్పంచ్‌లు సిరినేని గోవర్దన్‌రెడ్డి, తౌడ శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు నర్సింలుగౌడ్ ఉన్నారు.

రాయపోల్ : దౌల్తాబాద్ మండలం అహ్మద్‌నగర్ గ్రామ టీఆర్‌ఎస్ నాయకుడు షేక్ గుంషా తండ్రి దస్తగిరి ఇటీవల మృతి చెందగా బాధిత కటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆయన వెంట దౌల్తాబాద్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ పడకంటి శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లింగాయపల్లి యాదగిరి, నాయకులు ఇప్ప దయాకర్, షేక్ పాషా, రఫీక్, తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...