వైభవంగా దుర్గమ్మ వార్షికోత్సవాలు


Sat,March 23, 2019 12:26 AM

మద్దూరు: మండలంలోని వల్లంపట్లలో మహంకాళమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల తృతీయ వార్షికోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలిరోజు గ్రామ ప్రధాన కూడలిలోని మహా బొడ్రాయికి అర్చకులు శాస్ర్తోక్తంగా జలాభిషేకంతోపాటు అర్చనలను నిర్వహించారు. సాయంత్రం మహంకాళమ్మ, పోచమ్మ తల్లులకు గ్రామస్తులు బోనాలను సమర్పించారు. అంతకుముందు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆలేటి రజిత, మాజీ సర్పంచ్ గూళ్ల ఆనందం, ఉప సర్పంచ్ కర్నె మనోహర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...