భూగర్భ జలాలను పెంపొందించాలి


Sat,March 23, 2019 12:26 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజలు కృషి చేయాలని నెహ్రూ యువ కేంద్రం వలంటీరు దొమ్మాట రాజు కోరారు. మండలంలోని గుర్జకుంట గ్రామంలో శుక్రవారం ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని వృథా చేయకుండా భూమిలో తేమ శాతం పెం చేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు సాంబశేఖర్, పాండు, కరుణాకర్, సంతోష్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నెహ్రూ యువ కేం ద్రం వారి సహకారంతో గుర్జకుంట వివేకానంద వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోష ణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...