చిన్నకోడూరు నుంచే శ్రీకారం..


Fri,March 22, 2019 12:38 AM

చిన్నకోడూరు/నంగునూరు : పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంట్ అ భ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చిన్నకోడూరు నుంచి నేడు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు చి న్నకోడూరులో ప్రచారసభ, రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ ప్రచారానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలోని ఈ శాన్య భాగమైన చిన్నకోడూరు నుంచే ప్రచారం ప్రా రంభించగా ఎమ్మెల్యే హరీశ్‌రావుకు లక్ష పైచిలుకు మె జార్టీ వచ్చింది. దీంతో ఎంపీ ఎన్నికల ప్రచారం కూ డా చిన్నకోడూరు మండలం నుంచే ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సిద్దిపే ట నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించే ల క్ష్యంగా పార్టీ కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. చి న్నకోడూరులో రోడ్‌షో, భారీ ర్యాలీ నిర్వహించి అం బేద్కర్ సర్కిల్ వద్ద ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం చిన్నకోడూరు మండల టీఆర్‌ఎస్ పార్టీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
కోనాయిపల్లిలో ప్రత్యేక పూజలు..
నంగునూరు మండల పరిధిలోని కోనాయిపలి వేంకటేశ్వర ఆలయంలో ఉదయం 6.30 గంటలకు మెదక్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు హాజరుకావాలన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...