ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 12:38 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ డివిజన్‌లో ని ఐదు మండలాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనున్నందున గురువారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రంలో ఉదయం నుంచే పీవో, ఏపీవో, ఓపీవోలకు ఎన్నికల నిబంధనలను ఆర్డీవో అనంతరెడ్డి వివరించారు. పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన విధులను వివరించి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాల వారీగా అధికారులకు పంపిణీ చేశారు. డివిజన్‌లోని హుస్నాబాద్, అక్కన్నపేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండేసి పోలింగ్ కేంద్రాలు ఏ ర్పాటు చేయగా కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండల కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 7పోలింగ్ కేంద్రాల్లో 60మంది పీవో, ఏపీవో, ఓపీవో, ఇతర సిబ్బందిని నియమించారు. ఏడుగురు పీవోలు, 11మంది ఏపీవోలు, 18మంది ఓపీవోలు, ఏడుగురు మైక్రో అబ్జర్వర్లు, ఏడుగురు వెబ్‌కాస్టింగ్ సిబ్బంది, ఏడుగురు వీడియోగ్రాఫర్లు, ముగ్గురు జోనల్ అధికారులు, సుమారు 30మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. భద్రతా ఏర్పాట్లను ఏసీపీ ఎస్ మహేందర్ పర్యవేక్షించారు. ఆర్డీవో కార్యాలయం ఆవరణలో పోలీసు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఎన్నికల నిబంధనలు, భద్రతా చర్యలపై సిబ్బందికి వివరించారు.
కరీంనగర్ కలెక్టర్ సందర్శన..
కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల సామగ్రి పంపిణీ తో పాటు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అడిగి తెలుసుకున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...