నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు


Fri,March 22, 2019 12:38 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : నేడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగనుంది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు గురువారం సిబ్బందితోపాటు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సిద్దిపేట కలెక్టర్ కృష్ణభాస్కర్‌లు వివరించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని గురువారం ఉదయం ఇరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలకు అధికారులు వెళ్లే ముందు కేంద్రాల్లో కావాల్సిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి అందజేశారు. దాంతో పాటు బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామగ్రి సక్రమంగా సరఫరా చేయాలని ఆర్డీవో జయచంద్రారెడ్డికి వారు ఆదేశించారు. కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలిం గ్ ప్రక్రియ కొనసాగుతుందని, పోలింగ్ ముగిసే వరకు ప్రతి అంశాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. పీడబ్ల్యూడీ ఓటర్లకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, అర్బన్ తహసీల్దార్ విజయ్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...