హుస్నాబాద్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలి


Wed,March 20, 2019 11:54 PM

- 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలకపాత్ర
- వచ్చే ఏడాది గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- మరోసారి ఆశీర్వదిస్తే ఐదేండ్లు ప్రజాసేవకు అంకితమవుతా
- కరీంనగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌కు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీ ఇచ్చే లక్ష్యంతో పార్టీ నాయకులు,కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 వేలకుపైగా మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలు..వచ్చేనెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం పోతారం(ఎస్) శివారులోని శుభం గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎంపీ వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణకు వచ్చే నిధులు తీసుకరావడంతోపాటు రాష్ట్ర హక్కుల సాధన కోసం కొట్లాడుతారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌కే లబ్ధి చేసింది తప్పా రాష్ర్టానికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి కాళేశ్వరంను విస్మరించిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 180 కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేయించి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు వచ్చేలా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితోపాటు భవిష్యత్తులో కేంద్రం నుంచి సాధించే అంశాలను ప్రజలకు వివరించి ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఆశీర్వదిస్తే ఐదేండ్లు ప్రజాసేవకు అంకితమవుతా : ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా గడిచిన ఐదేండ్లలో జాతీయ రహదారులకు గానీ, రాష్ర్టానికి వచ్చే నిధులు, హక్కులను సాధించడంలో సీఎం కేసీఆర్ సహకారంతో ముందుండి పనిచేశానని, ఈసారి ఎన్నికల్లో కూడా మరోమారు ఆశీర్వదిస్తే మరో ఐదేండ్లు ప్రజాసేవకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంకితమవుతానని ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే పలు జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామన్నారు. కేంద్రంతో కొట్లాడి ప్రత్యేక హైకోర్టు సాధించుకున్నామని గుర్తు చేశారు. పోలవరం లాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కోసం కేంద్రంతో పోరాడుతానని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలోనూ పట్టు ఉండాలని, అందుకే సీఎం కేసీఆర్ 16 సీట్లు గెలవాలని పిలుపునిచ్చారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినట్లు..పార్లమెంటు ఎన్నికల్లోనూ కూడా భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీయే లక్ష్యంగా ముందుకు పోతామని హామీఇచ్చారు. నియోజకవర్గానికి జాతీయ రహదారి తెచ్చిన ఘనత ఎంపీ వినోద్‌కుమార్‌దేనన్నారు. ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్ మీదుగా నాందేడ్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు కార్యకర్తలు,నాయకుల మధ్య ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీలు భూక్య మంగ, సంగ సంపత్, శాలిని, జడ్పీటీసీలు బిల్ల వెంకట్‌రెడ్డి, శేఖర్, రామచందర్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, దేవేందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్‌రావు, సురేందర్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్‌కుమార్, ఆయా మండలాల నాయకులు వంగ వెంకట్రామిరెడ్డి, మ్యాక నారాయణ, ఎండీ అన్వర్, కాసర్ల అశోక్‌బాబు, చిట్టి గోపాల్‌రెడ్డి, ఆవుల మహేందర్, కృష్ణమాచారి, బీలూనాయక్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్, పరుశురాం, అరవింద, కనకలక్ష్మీ, పుష్ప, రమేశ్‌నాయక్, అఫ్రోజ్, గడ్డం మోహన్, కౌన్సిలర్లు, 8 మండలాల నుంచి వచ్చిన సర్పంచ్, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...