ఎన్నికల నియమావళిని పక్కాగా అమలుచేయాలి


Wed,March 20, 2019 11:53 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: ప్రశాంత వాతావారణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(దుబ్బాక ఏఆర్వో) నవీన్‌కుమార్ సూచించారు. బుధవారం దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఆర్వో నవీన్‌కుమార్ మోడల్‌కోడ్ అమలుపై అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని సూచించారు. అక్రమంగా మద్యం, డబ్బులు, వస్తువులు తరలిస్తే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు దృష్టి సారించాలని తెలిపారు. సీ-విజిల్‌తో పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని సూచించారు. పోలింగ్ రోజున, అంతకుముందు పోలింగ్ సామగ్రి తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోకసారి ఆయన అవగాహన కల్పించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో 261 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌కేంద్రాలను పరిశీలనతో పాటు నెలకొన్న సంఘటనలు ఎప్పటికపుడు తెలుసుకోవాలని సూచించారు. దుబ్బాక తహసీల్దార్ అన్వర్ , ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...