రెండో రోజూ నామినేషన్లు నిల్


Tue,March 19, 2019 11:42 PM

-మిగిలింది మూడు రోజులే
-ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మెదక్ పార్లమెంట్ పరిధిలో రెండోరోజు నామినేషన్లు ఎ వరు దాఖలు చేయలేదు. నామినేషన్ల ప్రారంభమై రెండు రోజలు పూర్తి అయినప్పటికీ ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. సోమవారం ప్రారంభమైన నామినేషన్లు ఈ నెల 25న ముగుస్తుంది. పోటీ చే యల్సిన అభ్యర్థులు తమ నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు దాఖలు చేయవచ్చు. 21,23, 24 తేదీల్లో సెలవులు ఉండడంతో కేవలం 3రోజులు మాత్రమే నామినేషన్లు వేయడానికి సమయం ఉంది. అభ్యర్థులు ముహుర్తాలు చూసి నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. 22,25 తేదీల్లో నామినేషన్లు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నాలుగురికి మాత్రమే ఎన్నికల రిటర్నింగ్ కార్యలయంలోకి అనుమతి ఉంది. మూడు వాహనలు, ఐదుగురు అభ్యర్థులకు మాత్రమే కార్యలయంలోకి అనుమతి. వంద మీటర్ల దూరంలోనే వాహనలను పోలీసులు నిలిపివేస్తారు. వాహనల కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...