గొల్ల కురుమలు బాగుండాలన్నదే సీఎం లక్ష్యం


Tue,March 19, 2019 11:34 PM

-గొర్రెలకు మంచి సౌలత్ ఏర్పాటు చేసుకుందాం
-సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : గొల్ల కురుమలు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. గొర్రెలకు మంచి సౌలత్ ఏర్పాటు చేసుకున్నాం. గొల్ల కురుమలు ఆత్మవిశ్వాసంతో జీవించేందుకే సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో సిద్దిపేట మండలం రాఘవాపూర్, మిట్టపల్లి, పలు గ్రామాల గొల్ల కురుమలతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. గొర్రెలు ఎట్లున్నయ్ కొమురన్న.. బ్యారం మంచిగ నడుస్తుంద ఎల్లన్న.. ఆరోగ్యం ఎట్లుందే.. అంటూ గొల్ల కురుమలను ఆప్యాయంగా పలుకరించారు. గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకే గొర్రెల పంపిణీని చేపట్టామన్నారు. అదే విధంగా గొర్రెల పెంపకందారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పెద్ద ఎత్తున గొర్రెల పెంపకానికి సీఎం కేసీఆర్ నిధులిచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు జీవాల స్థితిగతులు, గొర్రెల పెంపకం, వాటి మేత ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అందరూ గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలి..
మీ ఆరోగ్యం, మీ పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని గొర్రెల షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామాల్లో స్థల సేకరణ చేయాల్సిందిగా తహసీల్దార్, సర్పంచ్‌లకు సూచించారు. మన నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, నర్మెట, ఇర్కోడు గ్రామాల మాదిరిగా రాఘవాపూర్‌లోనూ గొర్రెల షెడ్లు నిర్మాణం చేపట్టాలని ఈజీఎస్ అధికారులను ఆదేశించారు.

గొల్ల కురుమ పెద్దలతో ఆప్యాయంగా ముచ్చట..
గొల్లకురుమల సమావేశం సందర్భంగా గ్రామానికి చెందిన కొమురయ్యతో మాట్లాడుతూ.. ఏం కొమురన్న గొర్రెలు ఎట్లున్నయ్.. ఎన్ని పిల్లలైనయ్.. మంచిగ చూసుకుంటున్నవా.. అని అడుగగా కొమురయ్య నవ్వుతూ సమాధానం చెబుతూ.. సార్ మీ దయతో మంచిగున్నయ్ మంచిగ సాదుకుంటున్నామన్నారు. అక్కడే ఉన్న సాయిలుతో జీవాల బ్యారం చేస్తున్నావా.. ఎంత పలుకుతుంది.. ఎన్ని జీవాలు ఉన్నాయి.. గొర్రెలకు పిల్లలైనయా అని అడిగి తెలుసుకున్నారు. సాయిలు సమాధానమిస్తూ బ్యారం చేస్తున్న.. సార్ మీరిచ్చిన గొర్రెలు బాగున్నాయి సార్ అని ఆరు నెలలకొకసారి అమ్ముతం సార్, గొర్రెలకు మంచి సౌలత్ చేయ్యాలి సార్ అని కోరారు. దీంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు నవ్వుతూ అక్కడున్న వారిని ఆప్యాయంగా పలుకరించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...