లక్ష్యం దాటిన పన్ను వసూళ్లు


Tue,March 19, 2019 11:34 PM

- జిల్లాలో రూ.11.11 కోట్ల పన్ను రాబడి
- గతేడాది కంటే ఈ యేడు అధికం
- 75 శాతం దాటిన పన్నుల వసూళ్లు
- గడువులోగా పన్నులన్నీ వసూలు చేస్తాం
- గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి
గజ్వేల్ టౌన్ : ఆర్థిక సంవత్సరం గడువులోగా ఇంటి, నల్లా బిల్లులు వసూళ్లు చేయడమే లక్ష్యం తో మున్సిపల్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు అనుకున్న సమయానికి ముందుగానే పన్నులు వసూళ్లు చేసేందుకు అధికారుల చేపడుతున్న చర్యలు ఫలిసున్నాయి. పిభ్రవరి నుండే లక్ష్యానికి చేరుకునే విధంగా ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూళ్లు చేసే పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎలాంటి పన్నులైనా మార్చి 31లోగా చెల్లించాలని అధికారులు చెప్పడం తో ఇంటి యాజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను లు చెల్లిస్తున్నారు. దీంతో జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీలతో పాటు చేర్యాల నగరపంచాయతీల్ల్లో ఇప్పటి వరకు రూ.11.11 కోట్లను వసూళ్లు చేశారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఆటోలను సమకుర్చుకొని ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీ జిల్లాలోనే 80.14 శాతం వరకు పన్నులు వసూళ్లు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీలతోపాటు చేర్యాల నగర పంచాయతీలో అధికారులు ఇంటి పన్నులను నిర్ధేశిత సమయానికి వసూళ్లు చేసేందుకు సమయత్తం అవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సిద్దిపేట మున్సిపాలిటీలో 80 శాతం పన్నులను అధికారులు వసూలు చేశారు. ఈ నెల 31లోగా అనుకున్న లక్ష్యం చేరుకొనే విధంగా జిల్లాలోని మున్సిపల్ అధికారులు మరింత శ్రమిస్తున్నారు. గతేడాది కంటే ఈ యేడు పన్నులు వసూళ్లు ఈ నెల 31లోగా పూర్తి చేసేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు.

సిద్దిపేటలో 25,203 గృహలకు రూ. 961.78లక్షల వసూళ్ల లక్ష్యంతో ముందుకెళ్లగా ఇప్పటి వరకు రూ.770.81 లక్షలను వసూళ్లు చేసి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. అదే విధంగా హుస్నాబాద్‌లో 5889 గృహలుండగా రూ.83.28 లక్షల వసూళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.64.65 లక్షలను అధికారులు వసూళ్లు చేశారు. గజ్వేల్‌లో 7957 గృహలుండగా రూ. 283.77 లక్షలకు గాను ఇప్పటివరకు రూ. 216,67 లక్షలు, దుబ్బాకలో 7620 గృహలకు రూ.65.91లక్షలకుగాను ఇప్పటి వరకు అధికారులు రూ.46.65 లక్షలను వసూళ్లు చేశారు. నూతనంగా ఏర్పాటైన చేర్యాల నగర పంచాయతీలో రూ.74.9 లక్షలను వసూళ్ల చేయాల్సి ఉండగా, నేటి వరకు అధికారులు రూ.13.10 లక్షలు మాత్రమే వసూళ్లు చేసి జిల్లాలోనే అందరి కంటే కిందిస్థాయిలో ఉన్నారు. చేర్యాలలో అతి తక్కువగా 17.49 శాతం పన్నులు వసూలు చేశారు.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగరపంచాయతీల్లో ఇప్పటి వరకు అధికారులు రూ.1469.64 లక్షలను ఇంటి పన్నుగా, నల్లా పన్నుగా రూ.1111.88 లక్షలను వసూళ్లు చేశారు. మిగతా పన్నులు కూడా త్వరితగతిన వసూలు చేసేందుకు అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టడం తోపాటు ఖచ్చితంగా ఈ నెల 31లోగా చెల్లించాలని ఇంటి యాజమానులకు సమాచారం అందిస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాఫూర్, క్యాసారం, మూట్రాజ్‌పల్లి, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్, గుండన్నపల్లి 7957 గృహ సముదాయాలున్నాయి. వీటిలో గజ్వేల్, ప్రజ్ఞాఫూర్‌లో వ్యాపార సముదాయాలు అధికంగా ఉన్నా యి. రెండు, మూడంతస్తుల ఇండ్లు అధికంగా ఉండడంతో ఇంటి పన్ను రాబడి అధికంగా వస్తుంది. గజ్వేల్ ప్రజ్ఞాఫూర్ మున్సిపల్ పరిధిలో కొన్నేళ్లుగా ఇంటి పన్ను చెల్లించనివారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.32 లక్షల వరకు ఆయా శాఖల కార్యాలయల నుంచి వసూళ్లు కావాల్సింది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...