సీపీఎస్ రద్దు కోసం పోరాటం


Tue,March 19, 2019 11:33 PM

సంగారెడ్డి టౌన్ : ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్ట చేస్తున్న సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మ న్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల వల్లనే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ శా పంగా మారిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధు లు నిర్వహించి రిటైర్డ్ అయిన తర్వాత ఎలాంటి పెన్షన్ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 1-7-2018 నుంచి రావాల్సిన పీఆర్సీ ఇవ్వాలని కోరారు. పీఆర్‌సీ కమిషన్‌కు 63 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వాలని, 50 శాతం పెరుగుదలతో అలవెన్స్ ఇవ్వాలని నివేదికలు ఇచ్చామన్నారు.

జూన్‌లో పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని, త్వరలో ఉద్యోగులకు నూతన పీఆర్సీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్న వారికి అండగా నిలబడాలని సూచించారు. ఉద్యోగుల గొంతుక వినిపించేందుకు ఉద్యోగుల నుంచి ప్రతినిధి కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనియన్లు జేఏసీగా ఏర్పడి చంద్రశేఖర్‌గౌడ్ విజయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి లక్షా 96వేల ఓట్లు ఉన్నాయని, వీటిలో లక్షా 40 వేలు ప్రభుత్వ ఉద్యోగులవే ఉ న్నాయన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగులు పోస్టల్ ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో విధులు నిర్వహించే చోటునే ఓటు వినియోగించుకునేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరామ ని తెలిపారు. పోస్టల్ ఓట్లతో ఎవరికి ఓటు వేశారో అనే విషయాన్ని తెలుసుకుని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బందిపై దా డులు చేస్తున్నారని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి నూతన పీఆర్సీ ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు.

సమావేశంలో ఉద్యోగుల జేఏసీ కో-చైర్మన్ రాజేందర్, కన్వీనర్ సత్యనారాయణ, భాగ్యనగర్ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హ న్మంతునాయక్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్యగౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్‌బాబు, ప్రధాన కార్యదర్శి జావేద్ అలీ, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్యాం రావు, వివిధ యూనియన్ల నాయకులు ప్రతాప్, రవి, చంద్రశేఖర్, వెంకటేశం, చందా శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, ఖాదర్ అలీ, బలరాంగౌడ్, ఎంవీ.కృష్ణయాదవ్, వైద్యనాథ్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...