ప్రశాంత ఎన్నికలకు చర్యలు


Tue,March 19, 2019 11:33 PM

-కామారెడ్డి కలెక్టర్, ఎస్పీతో
-సమావేశమైన సంగారెడ్డి కలెక్టర్
సంగారెడ్డి చౌరస్తా : జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు. మంగళవారం జిల్లాకు వచ్చిన కామారెడ్డి కలెక్టర్ డా. ఎం సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్ రాస్తో గీ, కామారెడ్డి జేసీ యాదిరెడ్డి, అసిస్టేంట్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రి, ఆర్డీవోలు పటాన్‌చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీని సందర్శించారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను వారు పరిశీలించారు. యూనివర్సిటీలో తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుకు పలు సూచనలు, సలహాలు చేశారు. అ నంతరం కలెక్టరేట్‌కు వచ్చిన కామారెడ్డి జిల్లా అధికారుల బృందం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హనుమంతరావును ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడు తూ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ఏర్పాట్ల ను పూర్తి చేశామన్నారు. అవసరమైన ఎన్నికల సిబ్బందిని ని యమించడం జరిగిందన్నారు. ఇప్పటికే పీవోలు, ఏపీలకు శిక్షణ అందించామని కలెక్టర్ వారికి వివరించారు.

నియోజకవర్గ పరిధిలోని 7శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అధికారుల శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. ర్యాండమైజేషన్‌తో సహా ఆయా పనులను పూర్తి చేసుకొని ఎన్నికలకు సిద్ధం గా ఉన్నట్టు వివరించారు. అనంతరం మొదటిసా రి కలెక్టరేట్‌కు వచ్చిన కామారెడ్డి కలెక్టర్‌కు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి అధికారుల బృందంతో పాటు ఆర్డీవో శ్రీను, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్నిక ల ఇన్‌చార్జి ఉమర్ పాషా పాల్గొన్నారు.
రెండో రోజు నో నామినేషన్స్
ఇదిలా ఉండగా, నామినేషన్ల స్వీకరణలో భాగంగా మంగళవారం రెండో రోజు కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 21న హోలీ పండగా, 22న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున అంతకుముందే, ఈ నెల 20న నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మధన్‌మోహన్‌రావు ఈ నెల 20న ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...