లక్షణంగా పద్దు


Fri,February 22, 2019 11:21 PM

-రైతు క్షేమం, సంక్షేమ పథం
-అన్నదాతలకు లక్ష రూపాయల రుణమాఫీ
-ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్
-జిల్లాలో 2 లక్షల మంది వరకు ప్రయోజనం
-వ్యవసాయం, నీటిపారుదలకు పెద్దపీట
-ఈ ఏడాదే జిల్లాకు గోదావరి జలాలు
-నిరుద్యోగులకు రూ.3,016 భృతి
-ఆసరా పింఛన్లు రెట్టింపు
-కులవృత్తులకు ఆసరా, రైతుబంధు సాయం పెంపు
-ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై హర్షాతిరేకాలు
రైతు సంక్షేమానికి రాష్ట్ర రథసారథి అధిక ప్రాధాన్యమిచ్చారు. సాగుపై భరోసా కల్పిస్తూ వారికి వెన్నంటి నిలిచారు. ఉచిత విద్యుత్తు సరఫరాతో దిగుబడి పెంచిన సీఎం కేసీఆర్..వారు తీసుకున్న పంట రుణాల్లో లక్ష రూపాయల వరకు మాఫీ ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పనని మరోసారి నిరూపించారు. 201 డిసెంబర్ 11 నాటికి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. అలాగే పెట్టుబడి సాయం కోసం ఇస్తున్న రైతుబంధు పథకానికి భారీగా నిధులు కేటాయించారు. వచ్చే వానకాలం నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున ఎన్ని ఎకరాలున్నా అందజేస్తారు. రైతుబీమాకు భారీగా నిధులు ఇచ్చారు. ప్రధానంగా సాగు, వ్యవసాయం, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం అన్న నినాదంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, కోతల్లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా, టీఎస్‌ఐపాస్ ద్వారా ఉద్యోగాల కల్పన వంటి అంశాలను సీఎం తన ప్రసంగంలో వివరించారు. అంతేకాదు ఆసరా పింఛన్లను రెట్టింపు చేశారు. వృద్ధాప్య పెన్షన్ కనీస అర్హత వయస్సు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడంతో భారీ సంఖ్యలో లబ్ధిపొందనున్నారు. ఈ ఏడాదిలోనే కరువు నేలపై గోదావరి జలాలు పారిస్తామని సీఎం తన ప్రసంగంలో చెప్పడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో ప్రాజెక్టు పనులు జెట్‌స్పీడ్‌తో సాగుతున్నాయి.


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ శుక్రవారం శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాలకు సమవూపాధాన్యాన్నిస్తూ తన బడ్జెట్‌లో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా నిధుల కేటాయింపు జరిపారు. సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి సాయం, కోతలు లేని నాణ్యమైన 24గంటల విద్యుత్ సరఫరా టీఎస్ ఐపాస్ ద్వారా ఉద్యోగాల కల్పన వంటి అంశాలను సీఎం తన ప్రసంగంలో వివరించారు. రైతుబంధు పథకం కింద జిల్లాలో 2.3 లక్షల మంది రైతులకు రెండు పంటలకు గానూ ఎకరాకు ఏడాదికి రూ. వేలు అందించారు. తాజాగా బడ్జెట్‌లో మరో రెండు వేలు పెంచి ఎకరాకు రూ.10 వేలు అందిస్తానని చెప్పడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో రూ.లక్ష రుణమాఫీని ప్రకటించారు. 201 డిసెంబర్ 11 నాటికి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 2లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉండే నేల స్వభావాన్ని బట్టి క్రాప్ కాలనీలుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించి రైతు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతాయి. ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూవివాదాలను పరిష్కరించి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందించింది. భూముల యజమాన్యాల హక్కుల విషయంలో వివాదాలను పరిష్కరించి, హక్కుల విషయంలో స్పష్టతనిచ్చింది. భూరికార్డులు పారదర్శంకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్‌బ్యాంకింగ్ తరహాలో ధరణీ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.

సంక్షేమ జోరుమొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిక్షిగస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని రూ నుంచి రూ.2016కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వికలాంగుల పెన్షన్ రూ.1500 నుంచి రూ.3016కు పెంచడంతో పాటుగా వృద్ధాప్య పెన్షన్ కనీస అర్హత వయస్సు 65ఏండ్ల నుంచి 57ఏండ్లకు తగ్గించడంతో ఎంతో మందికి లబ్ధిచేకూరనున్నది. జిల్లాలో ఆసరా పథకం కింద మొత్తం లక్షా 67 వేల మంది పెన్షన్ పొందుతున్నారు. పెన్షన్ కనీస అర్హత తగ్గించడంతో ఈ సంఖ్య మరింతగా పెరుగనున్నది. ఎలాంటి దిక్కు మొక్కులేని వారికి ఆసరా పథకం కింద సీఎం కేసీఆర్ భరోసానిస్తున్నారు. పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చి, రూ.లక్షా 116సాయం అందిస్తుండగా, పేదింట కల్యాణకాంతులు నింపుతున్నది. వివిధ కులవృత్తులకు చేయూతనిచ్చింది. జిల్లాలో 12 వేలకు పైగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సిద్దిపేట మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కంటి వెలుగు పథకం కింద 4,4,75 మందికి కంటి పరీక్షలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3016 ఇవ్వడానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్‌లకు రూ.5వేల భృతిని అందిస్తుండంపై ఆ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఏడాది గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు సాగునీరందిస్తామని సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వాయువేగంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. కాల్వల నిర్మాణ పనులు యుద్ధవూపాతిపదికన చేపడుతున్నారు. ప్రాజెక్టు నుంచి చెరువులను నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గొలుసుకట్టు చెరువుల ద్వారా గోదావరి జలాలు నింపనుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. మిషన్ కాకతీయ పథకం కింద నాలుగు విడుతల్లో జిల్లాలోని 3,256 చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంలు నిర్మించగా, గణనీయంగా భూగర్భజలాలు పెరిగి, పంటలు బాగా పండాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి గోదావరి జలాలు అందిస్తున్నారు.

ఆదర్శ గ్రామాలు నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలు, విధులను అందించడంతో పాటుగా గ్రామాల్లో పచ్చదనం కోసం నిధుల కొరత రానివ్వకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీ సొంత ఆదాయ వనరులు ఇలా అన్ని రకాల నిధులను కలుపుకొని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 500 జనాభా కలిగిన గ్రామానికి రూ. లక్షలు కేటాయించగా, ఉపాధిహామీ ద్వారా మరిన్ని నిధులు అందనున్నాయి. సర్పంచ్‌లు నిధులను సద్వినియోగం చేసుకొని చిత్తశుద్ధి, అంకిత భావంతో పని చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...