పేదల పాలిట వరం ‘ముఖ్యమంత్రి సహాయనిధి’


Fri,February 22, 2019 11:11 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సీఎంఆర్‌ఎఫ్ పేదల పాలిట వరంగా మారిందని సర్పంచ్ బండమీది సంతోషి, ఎంపీటీసీ వల్లావూపగడ వరలక్ష్మి అన్నారు. మండలంలోని నాగపురి గ్రామానికి చెందిన ఉల్లంపల్లి ఆంజనేయులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.34వేల చెక్కును ఎమ్మెల్యే ముత్తిడ్డి యాదగిరిడ్డి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారునికి చెక్కును సర్పంచ్, ఎంపీటీసీలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందే విధంగా కృషి చేస్తామన్నారు. యావత్ దేశంలోనే ఏ రాష్ట్రం చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న ఆంజనేయులకు డబ్బులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ముత్తిడ్డి యాదగిరిడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్షికమంలో ఉప సర్పంచ్ ప్రజ్ఞాపురం ఎల్లేశం, వార్డు సభ్యులు బీమా సత్యానారాయణ, కేతోజు చంద్రశేఖర్‌చారి, నాయకులు బండమీది కర్ణాకర్, వల్లావూపగడ వెంక గూడెపు మహేశ్, చిరుమల్ల కర్ణాకర్, శ్రీరాముల రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం మద్దూరు : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బైరాన్‌పల్లి మాజీ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని బైరాన్‌పల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆరుగొండ అనురాధకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 12వేల చెక్కును మాజీ సర్పంచ్ రాజమల్లయ్య బాధితురాలికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతోమందికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయిస్తున్న ఎమ్మెల్యే ముత్తిడ్డి యాదగిరిడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నట్లు వివరించారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు ఇమ్మడి సంజీవడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కర్ర అరుణ, గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి పురుషోత్తం, మాజీ ఉపసర్పంచ్ నందనబోయిన నర్సింలు, పీఏసీఎస్ డైరక్టర్ ఇమ్మడి మహిపాల్‌డ్డి, నాయకులు పురుషోత్తండ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...