గొలుసుకట్టు చెరువులు నింపుతాం


Fri,February 22, 2019 11:10 PM

నంగునూరు : కాళేశ్వరం ప్రాజెక్టుతో మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కాలువలను నిర్మిస్తున్నామని కాళేశ్వరం ఈఈ రవీందర్‌డ్డి, ఎంపీపీ జాప శ్రీకాంత్‌డ్డిలు అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైసంపల్లి, దానంపల్లి గ్రామ శివారులో కాలువ పనులు చేప శుక్రవారం స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో కొనసాగుతున్న కాలువల నిర్మాణాలు, గొలుసుకట్టు చెరువులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లో నీటిని నింపేందుకు కాలువలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రైతులందరూ సహకరించాలని కోరారు. కాళేశ్వరం ద్వారా నంగునూరు మండలంలో 23,621 ఎకరాలు సాగులోకి వస్తుందని, అదే విధంగా మల్లన్నసాగర్ ద్వారా 4,693 ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. ప్రతి చెరువు, కుంటను నీటితో నింపేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరంలో భాగంగా మండలంలో ప్రధాన కాలువ 1 కి.మీ పూర్తయిందని, ఇంకా 3 కి.మీ చేయాల్సి ఉందని, డిస్టిబ్యూషన్ కెనాల్, 100 కి.మీ మైనర్ కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్షికమంలో డిప్యూటీ ఈఈ మధుసూదన్, ఏఈలు చంద్రశేఖర్, ఖాజా, నీటి పారుదల శాఖ ఏఈ వీరభవూదయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ పబ్బతి రాంరెడ్డి ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...