పెండింగ్ పనులు పూర్తి చేయండి


Fri,February 22, 2019 11:09 PM

-పనుల పూర్తికి చర్యలు చేపట్టాలి
-ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశం
-ఆర్‌అండ్‌బీ అధికారులపై మండిపాటు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: నిధులు మంజూరైనప్పటికీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఆర్‌అండ్‌బీ, పీఆర్ అధికారులు, గడ ఓఎస్డీ ముత్యండ్డితో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం నిధులు మంజూరైనప్పటికీ నెలల తరబడి పనుల పెండింగ్‌పై ఎంపీ కొత్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్కూక్, గణేశ్‌పల్లి రోడ్డు పనుల నత్తనడకపై అసహనం వ్యక్తం చేసి సంబంధిత అధికారులను మందలించారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు కేటాయించినప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని సూచనలు చేశారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ల కోసం రోడ్లను తవ్వగా, వాటి పునరుద్ధరణలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని, అలాగే కాలువల నిర్మాణం కోసం రోడ్డు క్రాసింగ్ పునరుద్ధరణ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుందని, వీటన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నిధుల మంజూరైన పలు భవన నిర్మాణాల పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని సైతం వెంటనే పూర్తి చేయాలని సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని సమీక్షిస్తున్నారని, పెండింగ్ పనులపై తీవ్రంగా హెచ్చరించే వరకు అధికారులు వేచిచూడవద్దని సూచనలు చేశారు. పనుల ఆలస్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. సమావేశంలో పీఆర్ అధికారులు నర్సింలు, ప్రభాకర్, ఆర్‌అండ్‌బీ అధికారులు రామకృష్ణ, శ్రీను, జయదేవ్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...