ఇంటర్ పరీక్షలను యజ్ఞంలా నిర్వహించాలి


Fri,February 22, 2019 11:04 PM

సిద్దిపేట టౌన్ : ఇంటర్ పరీక్షలను యజ్ఞంలా నిర్వహించి విద్యాశాఖకు మంచిపేరు తీసుకురావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి సుధాకర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ బాలుర కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు ఇంటర్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాధికారి సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షా సమయంలో సీఎస్‌లు, డీవోలు, స్కాడ్ సభ్యులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. తప్పులకు అవకాశం లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ సమస్య ఉన్నా తనకు వెంటనే సమాచారం అందివ్వాలన్నారు. ఒకేషనల్, ఓల్డ్ న్యూ పరీక్షా పత్రాల విషయంలో తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించకూడదన్నారు. ఉదయం గంటల నుంచి పరీక్షా హాల్‌లోకి అనుమతించాలన్నారు. 9 గంటల తర్వాత పరీక్షా హాల్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దన్నారు. పోలీసు, పోస్టాఫీసు, వైద్య శాలల సహాయ సహకారాలు తీసుకునేందుకు వారికి ముందుగానే సమాచారం అందివ్వాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లను ముందస్తుగానే సీజ్ చేయాలన్నారు.

పరీక్షకు సంబంధించిన వివరాలను డిస్‌ప్లేపై ఉంచాలన్నారు. విధులు నిర్వహించే ప్రతిఒక్కరూ ఐడీ కార్డు ధరించేలా చూడాలన్నారు. ప్రశ్నాపవూతాలను సీసీ కెమెరాలు అమర్చిన గదిలోనే బయటకు తీయాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు పరీక్షా కమిటీ సభ్యు లు హిమబిందు, వంగ రాజు, సత్యనారాయణడ్డిలు పరీక్షల ముందు, పరీక్షా జరిగే సమయంలో, పరీక్షల తర్వాత చేయాల్సిన విధుల గురించి అవగాహన కల్పించారు. ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను విద్యాధికారి అభినందించారు. అనంతరం కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్షికమంలో ప్రిన్సిపాళ్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిషన్, శ్రీనివాస్, జేజేఎల్‌ఏ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, జిల్లా అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి నగేశ్, రాష్ట్ర నాయకులు రాములు, జిల్లా నాయకులు రమాదేవి, వనజ, రవీందర్‌డ్డిలు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రైవేటు కళాశాలల యజమానులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...