అవగాహన పెంచే సందేశాత్మక చిత్రాలు


Fri,February 22, 2019 11:04 PM

దుబ్బాక టౌన్ : చెట్లు నాటాలి...వానలు కురువాలి...పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు...చెత్తను తగ్గిద్దాం...పరిక్షిశుభతను పాటిద్దాం... చేయి చేయి కలుపుదాం... ఈవ్ టీజింగ్‌ని అరికట్టుద్దాం అంటూ గోడలపై సందేశాత్మక చిత్రాలతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత్తంగా ప్రచార కార్యక్షికమాలను అధికారులు దుబ్బాక పట్టణంలో చేపట్టారు. ప్రభుత్వ స్ఫూర్తి తో దుబ్బాక మున్సిపాలిటీ స్పందించి స్వచ్ఛత కార్యక్షికమంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులను అందమైన బొమ్మల రూపంలో గోడలపై చిత్రీకరిస్తున్నారు.

స్వచ్ఛతపై ముఖ్యంగా ప్రజలను పారిశుద్ధ్ద్యంపై చైతన్యపరచడం, బహిరంగ మలవిసర్జనకు దూరం చేయడం, చెత్త సేకరణ, రవాణా మొదలగు అంశాలను చేపట్టారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన జరగకుండా చేయడం, ఇండ్లు , హోటళ్లు, బహిరంగ ప్రదేశంలో చెత్తను వేయకుండా పరిసరాలను పరిశువూభంగా ఉంచుకోవడం వంటి చర్యలపై పెయింటింగ్‌ల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ గోడలపై షీటీంలతోపాటు మహిళల రక్షణ వంటి పోలీసు సేవలను ప్రతిబింభించే విధంగా బొమ్మలను వేయించారు. సర్కార్ దవాఖాన గోడలపై ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. హరితహారంపై వేసిన బొమ్మలు పట్టణానికి కొత్త అందాలను తెస్తున్నాయి. పట్టణ అందంతో పాటు ప్రజల్లో అవగాహన కలిగే విధంగా పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై వేస్తున్న చిత్రాలు సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మొత్తం మీద గోడలపై వేస్తున్న సందేశాత్మక చిత్రాలతో దుబ్బాకకే కొత్త అందాన్ని, సందేశాన్ని అందిస్తున్నాయని ప్రజలు సంబురపడుతున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...